ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ సిఎం పిఠాన్నికి దూరం..అమిత్‌ షా

కూచ్ బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా

HM Shri Amit Shah launches “#PoribortonYatra​” from Rash Mela Ground, Cooch Behar, West Bengal.

కోల్‌కతా: ఉత్తర బెంగాల్ లోని కూచ్ బీహార్ లో అమిత్ షా ఈరోజు ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మే తర్వాత మమతా బెనర్జీ బెంగాల్‌ సీఎం పీఠంపై ఉండబోరని జోస్యం చెప్పారు. బెంగాల్‌ ప్రజలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మమతా బెనర్జీ సర్కార్‌ నీరుగార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోడి అభివృద్ధి మోడల్ కు, మమతా బెనర్జీ విధ్యంసకర మోడల్ కు మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు.