ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోల పోస్టర్లు

maoists
maoists

భద్రాచలం: తెలంగాణ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోలు మరోమారు హెచ్చరించారు. ఇవి బూటకపు ఎన్నికలని, ఓటేయవద్దని కోరారు. గతంలోనూ మావోలు ఎన్నికలు బహిష్కరించాలని కోరుతూ మరో నియోజక వర్గంలో పోస్టర్లు అంటించారు. తాజాగా భద్రాద్రిలోని చర్ల మండలం దేవరపల్లిలో మావోల పోస్టర్లు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఎన్నికలను బహిష్కరించాలని కోరడంతో పాటు డిసెంబరు 2 నుంచి 8వ తేదీ వరకు జరిగే పిఎల్‌జిఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆ పోస్టర్లలో కోరారు. కాగా, మావోల పోస్టర్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావో ప్రభావిత నియోజకవర్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.