ఎన్టీపిసి డైరక్టర్‌ బిశ్వాల్‌పై వేటు

Suspend
Suspend

దిల్లీ: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపిసి డైరక్టర్‌(ఫైనాన్స్‌) కులమణి బిశ్వాల్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను ససెపండ్‌ చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో బిశ్వాల్‌ సహా మరో ఇద్దరిపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న బిశ్వాల్‌ను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ విద్యుత్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లిన సందర్భంలో ఆయన బతిన టెక్నాలజీస్‌ సంస్థ నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారంటూ సిబిఐ ప్రాథమిక నివేదికలో పేర్కొంది.