ఎన్టీఆర్‌ మూవీ విలన్‌..

JAGAPATI BABU
JAGAPATI BABU

ఎన్టీఆర్‌ మూవీ విలన్‌..

ఎన్టీఆర్‌,త్రివిక్రమ్‌ సినిమా ఏప్రిల్‌ రెండోవారం నుండి షూటింగ్‌ ప్రారంభం కానుంది. తాజా సమాచారంప్రకారం జగపతిబాబు ఈసినిమాలో విలన్‌పాత్రలో కన్పించనున్నారని తెలుస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కన్పించబోతున్న ఎన్టీఆర్‌ ఈసినిమా కోసం తన లుక్‌ మార్చుకోవటం జరిగింది.. స్క్రిప్టు వర్క్‌ పూర్తి చేసిన త్రివిక్రమ్‌ ప్రస్తుతం నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈసినిమాకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.. పూజా హెగ్డేతోపాటు మరో హీరోయిన్‌ ఈచిత్రంలో నటించనుందని తెలుస్తోంది.