ఎన్టీఆర్‌ బయోపిక్‌

BIOPIC
BIOPIC

ఎన్టీఆర్‌ బయోపిక్‌

ఎన్టీఆర్‌ బయోపిక్‌ ని తెరకెక్కిస్తానని బాలకృష్ణ ఎప్పుడో అనౌన్స్‌ చేశారు.. కానీ ఇప్పటి వరకు ఆ బయోపిక్‌కి సంబంధించిన విశేషాలేమీ మీడియాకు చెప్ప్లలేదు.. అయితే బాలయ్య ఇపుడు పోర్చుగల్‌లో ‘పైసా వసూల్‌ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉఆన్నరు.. ఇక పోర్చుగల్‌లో షూటింగ్‌ ముగించుకుని త్వరలోనే హైదరాబాద్‌కి రానుంది చిత్రం యూనిట్‌.. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత బాలయ్య బాబు ఎన్టీఆర్‌ బయోపిక్‌కి సంబంధించిన పనుల్లో బిజీ అవుతానని అంటున్నారు..అందులో భాగంగానే ఎన్టీఆర్‌ హయాంలో పనిచేసిన ఐఎఎస్‌ అధికారులతో పాటు కొందరు సినీ ప్రముఖులను , తమ కుటుంబ సభ్యులను కలిసి తన తండ్రికి సంబంధించిన విషయాలపై కూలంకషంగా చేరించిన తర్వాతే ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడిని బాలయ్య ఫైనల్‌ చేస్తానని చెబుతున్నారు..
ఇక తండ్రి బయోపిక్‌ని తెరకెక్కించి ఆయన రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నానని అంటున్నారు.. ఈ సినిమాతో ఇకముందు కొత్త బాలయ్యను చూడబోతున్నారని స్వయానా బాలకృష్ణే అంటున్నారు.. జానపదంలో ఫాంటసీ ఉండేలా ఓ కథ రెడీ అవుతోందని, ఒక పౌరాణిక సినిమా కూడ చేయబోతున్నానని .వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని బాలయ్య అంటున్నారు.