ఎన్టీఆర్‌ ప్రజలకోసం పోరాడారు: బాలయ్య

BALA1

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ప్రజలకోసం పోరాడారని హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రసూల్‌పురాలో ఎన్టీఆర్‌ 20వ వర్థంతి కార్యక్రమంలో ఆయన నివాళులర్పించారు. కాంగ్రెస ఏకచఆధిపత్యాన్ని కూలదోసింది ఎన్టీఆరేనని అన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని పార్టీని నడిపిస్తున్నామని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ అహర్నిశలు పోరాడారని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా డిటిపికి ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. ఆయన హయాంలో పేదల కోసం రూ.2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారని నివాళులర్పించారు.