ఎన్టీఆర్‌ కోసం టాప్‌ టెక్నీషియన్‌

Muralidharan11
Muralidharan11

ఎన్టీఆర్‌ కోసం టాప్‌ టెక్నీషియన్‌

ఎన్టీఆర్‌ అభిమానులంతా ఆయన తదుపరి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్లకి ఆనందాన్ని కలిగించడం కోసం ఎన్టీఆర్‌ కూడా తన తదుపరి సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్‌ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి కల్యాణ్‌ రామ్‌ నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై భారీ స్థాయిలో నిర్మించాలనే ఆలోచనలో వున్న ఆయన, సాంకేతిక వర్గంలో బెస్ట్‌ టెక్నీషియన్స్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. అందులో భాగంగా బాలీవుడ్‌ కి చెందిన బెస్ట్‌ సినిమాటో గ్రాఫర్‌ సి.కె. మురళీధరన్‌ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని సదరు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఆయన పీకే.. త్రీ ఇడియట్స్‌.. మొహంజోదారో వంటి భారీ సినిమాలకి పనిచేసి వున్నారు. త్వరలోనే ఇతర సాంకేతిక వర్గం.. నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.