ఎన్ఆర్ఐల స‌హ‌కారం ముఖ్యంః ప‌వ‌న్‌

PAWAN KALYAN
PAWAN KALYAN

విజ‌య‌వాడః నగరంలో ఎన్ఆర్ఐ వింగ్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన సమావేశం ముగిసింది. ఎన్ఆర్ఐలను పార్టీకి నిధుల బ్యాంక్‌గా చూడబోమని జనసేనాని అన్నారు. పార్టీ నెట్ వర్కింగ్‌లో సహాయపడాలని కోరారు. ఏపీ అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహాయం ఎంతో అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌తో భేటీ అయిన ఎన్ఆర్ఐలు ఓ ఛాన‌ల్‌తో మాట్లాడుతూ అందరం కలిసి ప్రజల సమస్యలపై పోరాటం చేద్దామని పవన్ చెప్పారని, అంతకు మించి ఇంకా ఎలాంటి సహాయం అవసరం లేదని అన్నారని, ప్రజా ఉద్యమాన్ని ప్రజల కోసం ఉపయోగిద్దామని చెప్పారని అన్నారు. పవన్ ఐడియాలజీని తాము ముందుకు తీసుకువెళతామని, అదే విషయం పవన్‌కు చెప్పామని ఎన్ఆర్ఐలు తెలిపారు.