ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం

India vs New Zealand 4th ODI
India vs New Zealand 4th ODI

హామిల్డన్‌: న్యూజిలాండ్‌తో ఆడుతున్న నాలుగో వన్డేలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కేవలం 92 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. తరువాత బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 93 పరుగుల స్వల్ప విజయ లక్ష్యని సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్(11) కూడా భువనేశ్వర్ బౌలింగ్‌లో కీపర్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కానీ మరో ఓపెనర్ హెర్నీ నికోలస్(30), రాస్ టేలర్‌(37)లు కలిసి కివీస్‌ విజయానికి బాటలు వేశారు. దీంతో 14.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.