ఎదురు దెబ్బ‌ల‌ను త‌ట్టుకొని ముందుకు వెళ్ల‌డమే యువ‌త ముందున్న స‌వాలుః కేటీఆర్

KTR
KTR

హన్మకొండ: మంత్రి కేటీఆర్ శనివారం వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హ‌న్మకొండ నిట్‌లో టాస్క్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంత‌రం ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటిని తట్టుకుని ముందుకు వెళ్లడమే యువత ముందున్న సవాల్ అని, వరంగల్ పిల్లలకు జిల్లాలోనే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఇండస్ట్రీ టాలెంటెడ్ మ్యాన్ ఫవర్ ఇక్కడ ఉందని అన్నారు. ఏ రకమైన నిధులు కావాలన్న ప్రభుత్వం వైపు నుంచి వరంగల్‌కు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.