ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సల్స్‌ మృతి

encounter
encounter

సుక్మా: చత్తీస్‌ఘడ్‌లో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుక్మా జిల్లాలోని సక్లార్‌ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సల్స్‌ మృతిచెందారు. డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. ఐతే ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు డిఆర్‌జి పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్‌లో మరో నక్సల్‌ గాయపడ్డారు. అతని వద్ద నుంచి బర్మా గన్‌ను ఆర్మీ దళానికి చెందిన నక్సల్స్‌, పోలీసుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సిపిఐ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ దళానికి చెందిన నక్సల్స్‌ ఎదురుకాల్పుల్లో మృతిచెందారు.