ఎదురుకాల్పుల్లో జ‌వాన్లు హ‌తం

Encounter22
Encounter

కాంకెర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్‌ జిలాల్లో నక్సల్‌కూ, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో జవాను గాయపడ్డాడు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్న బీఎస్ఎఫ్ 114వ బెటాలియన్ తిరిగి వస్తుండగా మహ్లా క్యాంప్ సమీపంలోని అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీజీపీ పి.సుందర్‌రాజ్ తెలిపారు. హోరాహోరీ కాల్పుల అనంతరం నక్సల్స్ దట్టమైన అడవుల్లోకి పారిపోయినట్టు ఆయన చెప్పారు. మృతిచెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్‌లో ఒకరిని రాజస్థాన్‌కు చెందిన లోకేందర్ సింగ్‌గా, మరొకరిని పంజాబ్‌కు చెందిన ముక్తియార్ సింగ్‌గా గుర్తించామని, మరో కానిస్టేబుల్ సందీప్ దేవ్ (పశ్చిమబెంగాల్) గాయపడ్డాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు.