ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

TERRORIS
TERRORIS

శ్రీనగర్‌: ఈరోజు ఉదయం జమ్ముకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. షోపియాన్‌ జిల్లా సాఫ్‌నాగ్రిలో నేటి ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి పెద్దయెత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అదనపు బలగాలను అక్కడికి తరలించారు. సంఘటనా ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.