ఎదురుకాల్పులపై విచారణ జరిపించాలి

          ఎదురుకాల్పులపై విచారణ జరిపించాలి

Encounter
Encounter

దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ లో వరుసపెట్టి జరుగుతున్న పోలీస్‌ ఎన్‌కౌంటర్లపై జాతీయ మానవ హక్కుల సంఘం ఇటీవల తీవ్రంగా స్పందించింది. ఆ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగమంటే ప్రజల్ని ఇష్టానుసారంగా కాల్చేసేందుకు ఇచ్చిన లైసెన్స్‌ అని వ్యాఖ్యా నించిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమౌ తొంది. రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి సారధ్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీతో ఆ రాష్ట్రంలో గత మూడేళ్లలో జరిగిన రెండు వేలకు పైగా ఎన్‌కౌంటర్ల, లాకప్‌ డెత్‌లపై సమగ్ర దర్యప్తు జరిపించాలన్న విపక్షాల అభ్యర్ధనను మన్నించి జాతీయ మానవ హక్కుల కమీషన్‌ కేంద్ర ప్రభుత్వానికి తగు చర్యలు తీసుకోవాలని నొటీసులు పంపించింది. గత మూడేళ్ళుగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు, అనధికార కాల్చివేతలు, లాకప్‌డెత్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం 2000 వేల ఎన్‌కౌంటర్లు, 1650 లాకప్‌డెత్‌లు జరిగాయని తెలుస్తోంది. రాష్ట్రం వైశా ల్యం ప్రకారం చూసినా ఈ సంఖ్య బాగా ఎక్కువే. అధి కారం చేపట్టిన తొలినాళ్ళలోనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దాదా గిరీ, గుండాగిరి, అత్యాచారాలు, దొంగతనాలు,రేప్‌లు, హత్యలు, పరువు హత్యలు వంటివి ఏరివేస్తామని ముఖ్య మంత్రి ఆదిత్య యోగీనాథ్‌ ప్రకటించారు. దారుణమైన ఆకృత్యాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిడ్నాపింగ్‌లు, అత్యాచారాల వంటి దారుణమైన నేరాల పరంగా దేశంలో మొదటి స్థానం లో వున్న ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు ప్రభుత్వాధినేతగా కఠినమైన చర్యలు చేపట్టడం అవశ్యకం.

అయితే ఈ ప్రక్రియ న్యాయం,చట్టం, రాజ్యాంగం పరిధిలో సాగవల్సి వుంది. కాని ప్రభుత్వం, పోలీసు పెద్దలు అత్య్సుహం కనబరిచి నిందితులను ఎలాంటి విచారణలకు గురి చేయకుండా ఎన్‌కౌంటర్‌ చేయడం, పోలీస్‌ లాకప్‌లలో చిత్రహింసలకు గురి చేసి చంపేయడం మాత్రం అహేతుకం. సరిగ్గా ఆ రాష్ట్రంలో అదే జరిగింది. న్యాయపరమైన విచారణల ద్వారా న్యాయ స్థానాలు విధించిన శిక్షల కంటే ఏరివేత కార్యక్రమం ద్వారా అనధికారంగా నిందితులను తుదముట్టించిన సంఘటనలే అధికంగా వుండడం గమనార్హం. యూపిలో సాగుతున్నది యోగిపాలనా… ఎన్‌కౌంటర్ల రాజ్య మా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తలెత్తింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో పేదరికం, నిరక్షరాస్యత, అనేక సామాజిక రుగ్మతలు వేళ్లూనుకొన్నాయి.

వాటిని తొల గించకుండా, పరిపాలన సంస్కరణలు చేపట్టకుండా… అరాచ క పరిస్థితులను సాకుగా చూపి పోలీసులకు అపరిమిత అధికా రాలు అప్పగించడమంటే ఎన్‌కౌంటర్ల రాజ్యన్ని ఆవిష్కరించ డమే తప్ప వేరేమీ కాదు. ఇటువంటి దారుణ పరిస్థితు ల్లోనూ పౌరులు మత ప్రాతిపదికగా స్పందించడమంటే సమాజం ఎటు పోతుందో అనే భయం కలగక తప్పదు. ఇందులో బలైనవారు అత్యధికులు ముస్లింలేనని ఇటీవల సమాజ్‌ వాదీ, బహుజన సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ పర్వానికి మతం, రాజకీయ రంగు అలుము కుంది. ప్రధాన రాజకీయ పక్షాలు పరస్పర ఆరోపణలతో అతి సున్నితమైన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మత సంఘర్షణలు తలెత్తే ప్రమాదం వుందని రాజకీయ విశ్లేకులు హెచ్చరిస్ను న్నారు.

లక్నోలోని ఆపిల్‌ కంపెనీ ఉన్నతోద్యోగి వివేక్‌ తివారీ(38) ని పోలీసులు కాల్చివేసిన తీరు ఆ రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నది. తమ కంపెనీ కొత్త ఫోన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలొ పాల్గొని అర్థరాత్రి ఇంటికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసు కున్నది. అయితే ఒక నిరపరాధిని కాల్చివేసిన ఘోరఘటన ను సమర్ధించుకునేందుకు పోలీసులు రకరకాల కట్టుకథలు కల్పించారు. పోలీ సుల మోటారు సైకిల్‌ను తివారీ కారు ఢీకొట్టి కూడా ఆగకుండా పారిపోతున్నందున కాల్పులు జరిపి నట్లు రెండో కథనం. పోలీసులు ఆపినా కారు ఆపకపోవడం నిజంగా తప్పే, అయితే ఇలాంటి సంధర్బాలలో ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపేయడం మాత్రం నిస్సందేహంగా క్షమా ర్హం కారు ఆపనందుకు ఓ ఉద్యోగస్తుడ్ని పోలీసులు కాల్చి చంపే స్థాయికి ఎన్నడూ ఏరాష్ట్రమూ దిగజారలేదు.

ఏడాది న్నర కాలంగా రాష్ట్రంలో సాగిన రెండువేల ఎన్‌కౌంటర్లు, 66 హత్యలు సక్రమమైనవేననీ, ఇదొక్కటే పొరపాటని తేల్చేయడం కూడా ఈ ఆమోదంలో అంతర్బాగం. చట్టబద్దపాలన పాదు కొల్పడం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రజల్లో నేర రాజకీయా లపై నెలకొన్న ఆగ్రహాన్ని ఆసరాగా చేసుకొని చట్టవిరుద్ధ పాల నను సాగించడం ఇంకా ప్రమాదకరం. రాష్ట్ర వ్యాప్తంగా జరు గుతున్న ఎన్‌కౌంటర్ల, ఏరివేత ప్రక్రియలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తుత్తి కమిటీని నియమించింది. ఈ కమిటీ, పేరుకే విచారణను చేసి, ఇంతవరకు జరిగిన ఎన్‌కౌంటర్లు అన్నీ సక్రమమైనవనే తేల్చి ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించడం ప్రజాస్వామ్య వ్యవ స్థను అవహేళన చేయడమే.

ఈ ఘటనలలో మరణించిన వారికి సైతం ప్రభుత్వ పరంగా రావల్సి వున్న పరిహారం కేవలం 15 శాతం మందికే అందిందన్న వార్తలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తున్నాయి. చట్టం చేతులలోనికి తీసుకోవడం ఒక తప్పుకాగా జరిగిన పొరపాట్లకు బాధ్యులైన వారిపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం,మృతులకు సక్రమ పరిహారం అందించపోవడం అమానవీయమని మానవ హక్కుల సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఇటువంటి ఘటనలను ఖండించడంతో పాటు ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఎంతో వుంది.
– సి.ప్రతాప్‌