ఎదిగే పిల్లలపై పారిశుద్ధ్య ప్రభావం

                              ఎదిగే పిల్లలపై పారిశుద్ధ్య ప్రభావం

CHILDREN
CHILDREN

వయసుకు తగినట్టు ఎదుగుదల పిల్లల్లో కనిపించకపోడానికి ప్రధానమయిన సమస్యల్లో పారిశుద్ధ్య దుస్థితి ఒకటి. ఈ పారిశుధ్ద్యప్రభావాన్ని రెండువిధాలుగా అధ్యయనం చేశారు. నీరు, పారిశుధ్ధ్యం,పరిశుభ్రత, ప్రధాన అంశాలుగా బంగ్లాదేశ్‌, కెన్యన్‌ గ్రామాల్లో రెండేళ్లపాటు అధ్యయనం సాగించారు. వర్ధమానదేశాల్లో రెండేళ్లలోపు పిల్లల్లో కనిపించే ఎదుగుదల లోపాన్ని అధ్యయనంచేశారు. ప్రత్యేకంగా ‘వాష్‌ (వాటర్‌, శానిటేషన్‌, హైజీన్‌) మధ్యవర్తిత్వం వహించి నాణ్యత లేని టాయిలెట్లకు బదులుగా నాణ్యమయిన టాయిలెట్లను ఏర్పాటుచేయడం, మంచినీటిలో క్లోరిన్‌కలపడం, చేతులుకడుక్కోవడాన్ని అభివృద్ధిచేయడం, ఇవన్నీ మలవిసర్జనాలనుంచి వెలువడే హానికర బ్యాక్టీరియా నుంచి పిల్లలను రక్షించుకోడానికి ఒకేసారిప్రయత్నించాలి, ఈ బ్యాక్టీరియా పిల్లల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ చివరకు ప్రయోగాత్మక చర్యలు పూర్తయిన తరువాత పరిశీలిస్తే నిరాశే మిగిలింది. ఏ పిల్లలపై ప్రయోగాలు జరిపారో వారు ప్రయోగాలు లేని పిల్లల ఎత్తుకన్నా మించి పెరగక పోవడం గమనార్హం, పారిశుద్ధ్యం అభివృది ్ధచెందితే పిల్లలను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయన్న సిద్ధాంతానికి వాస్తవ ఫలితాలేె భిన్నంగానే కనిపించాయి. బంగ్లాదేశ్‌, కెన్యాదేశాల్లోని పిల్లలను వెంటాడే అనారోగ్యసమస్యలకు భారత్‌ వంటిదేశాల పిల్లల సమస్యకు తేడా కనిపిస్తోంది.భారత్‌లో 50శాతం కన్నా ఎక్కువమంది జనాభా ఇంకా ఆరు బయట మలవిసర్జన అలవాటుతోనే ఉంటున్నారు.

జనాభాలోనూ, జనసాంద్రతలోనూ భారత్‌కు చేరువగా ఉన్న బంగ్లాదేశ్‌లో ఆరుబయట మలవిసర్జన అలవాటును బాగా తగ్గించ గలిగారు. అక్కడ 2003లో 42శాతం మంది ఆరుబయలు మలవిసర్జన అలవాటులో ఉండగా 2016 నాటికి ఆ అలవాటు ఒక్కశాతానికి చేరింది. దీన్నిబట్టి అక్కడ ప్రజలల్లో ఎంతమార్పు తీసుకురాగలిగారో తెలుస్తుంది. బంగ్లాదేశ్‌లో కేవలం 3.9 శాతం మంది అధ్యయనంలో పాల్గొనగా, కెన్యాలో 5 శాతం కన్నా తక్కువ మంది అధ్యయనంలో పాల్గొన్నారు. చాలామంది ప్రజలకు మరుగుదొడ్లు అవి నాణ్యతలేనివైనా ఉన్నాయి. ఇది అధ్యయనం అభివృద్ధికి దోహదపడింది. ఈ పిల్లల నమూనాలను పరిశీలించగా తక్కువ స్థాయిలో మొదటిస్థానంలో మలవిసర్జన బ్యాక్టీరియా ఉన్నట్టు బయటపడింది. కనీస మరుగుదొడ్ల సదుపాయం నుంచి పూర్తిగా ఆధునికీకరించిన మరుగుదొడ్ల సదుపాయం వరకు గల అభివృద్ధికే ఈ అధ్యయనం తోడ్పడింది తప్ప పిల్లల ఎదుగుదలలో తేడా మాత్రం కనిపించలేదని’రైస్‌ పరిశోధకుడు డేన్‌స్వియిర్స్‌ వెల్లడించారు. వాష్‌ మధ్యవర్తిత్వం ఉన్నాఫలితం చూపించలేదు. భారతదేశానికి ప్రధాన సవాలుగా మారిన ఆరుబయట మలవిసర్జన పై ఎవరోఒకరు దృష్టి కేంద్రీకరించాలన్న సమాచారం అంతగా లేదని డీన్‌స్పియర్‌ పేర్కొనారు. అయితే మరికొందరు ఈ కొత్త అధ్యయనాలు, ప్రయత్నాలు సందేహాలను లేవనెత్తుతున్నాయని వాదిస్తున్నారు. భారత్‌లో వెంటాడుతున్న అనారోగ్యసమస్యలకు పారిశుధ్యానికి సంబంధంపై సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో తక్కువ నాణ్యత గల నాసిరకం మరుగుదొడ్ల వల్ల మలవిసర్జన నుంచి వచ్చే అంటువ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వ్ఞల్ఫ్‌పీటర్‌ విశ్లేషించారు. లండన్‌స్కూల్‌ ఆఫ్‌హైజిన్‌ సంస్థకు చెందిన ఎపిడెమియాలిజిస్టుగా ఆయన పని చేస్తున్నారు స్టాక్‌ఫర్డ్‌ వ్ఞడ్స్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఎపిడెమియోలజిస్టు స్టీపెన్‌ లూబీ బంగ్లాదేశ్‌లో అధ్యయనంలో పరిశోధకునిగా ఉంటున్నారు. బంగ్లాదేశ్‌లో అధ్యయనం చేసిన గ్రామాల్లో ఎక్కువగా అంటువ్యాధులు, పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం కనిపించాయని చెప్పారు.”వాష్‌ అభివృద్ధి చర్యలు ఈ గ్రామాల్లో అమలవ్ఞతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదని దీన్ని బట్టి ఇతర అంశాలు పిల్లల ఎదుగుదల లేక పోడానికి కారణమవ్ఞతున్నాయని చెప్పారు భారత్‌లోని పిల్లల ఎదుగుదలకు, ఆరుబయలు మల విసర్జనకు గల సంబంధం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని వివరించారు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం క్లిష్ట సమస్య, నిరుపేద సబ్‌ సహరాన్‌ ఆఫ్రికా దేశాల పిల్లల కన్నా ధనిక దక్ష్షిణ ఆసియా దేశాల పిల్లలు సరాసరిగా పొట్టిగా ఉంటారు. ఈ తేడాను ఇంత వరకు ఏ మధ్యవర్తి చర్యలూ తీర్చలేవ్ఞ.గర్భస్థ శిశుఆరోగ్యం, మాతృస్తన్య పోషణ, సంపూర్ణ ఆహారం, తదితర అంశాలు పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయి.బిడ్డకు తల్లి పాలు అందించడం, తల్లిబిడ్డలకు సంపూర్ణఆహారం అందివ్వడం వంటివి ప్రోత్సహించే చర్యలు త్వరలో ప్రారంభమవ్ఞతాయి. ఇదే సమయంలో పరిశోధనలు ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని రూపొందించారు.

పారిశుధ్ధ్యలోపం పిల్లల ఎదుగుదలలో ప్రధాన పాత్ర వహిస్తుందని స్పష్టం చేశారు.మలవిసర్జ న బ్యాక్టీరియా పరాన్నజీవ్ఞలు పిల్లల పోషకాలపై విపరీత ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పారు. ఈ సిద్ధాంతానికి సాక్ష్యం గత కొన్ని దశాబ్దాలుగా మూలనపడి ఉంది. 1990లో గేంబియన్‌ పిల్లలపై జరిగిన అధ్యయనంలో పేగుల్లో మంటపుట్టడం పధానసమస్యగా తేలింది. మలవిసర్జన బ్యాక్టీరియల వల్లనే ఇది సంభవించి చివరికి పిల్లల్లో ఎదుగుదల ఆగిపోడానికి దారి తీస్తుందని 1990 నాటికి అధ్యయనం స్పష్టంచేసింది. జంతువ్ఞలకు సంబంధించి ఎలుక పిల్ల ఏస్టిరిబియా కొలి అనే మలవిసర్జన బ్యాక్టీరియాకు గురవ్ఞతుందని, మెల్లగా అది పెరిగి పేగుల్లో మంట పుట్టించే సంకేతాలు ఇస్తుందని ఆ ఎలుకపిల్లలనుకోసి పరిశోధించగా తేలింది. 2013లో శాస్త్రవేత్త స్పెయర్స్‌ 65దేశాల వివరాల సమాచారాన్ని విశ్లేషించారు. ఆరుబయలు మలవిసర్జన ఎక్కువ్ల, తక్కువగా ఉన్న ప్రాంతాల మధ్యగల తేడాను అంటువ్యాధుల ప్రభావాన్ని వివరించారు. భారత్‌ బంగ్లాదేశ్‌ వంటి అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో ఆరుబయట మలవిసర్జన ప్రభావాన్ని వివరించారు. భారత్‌, బంగ్లాదేశ్‌ వంటి అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో ఆరుబయట మలవిసర్జన ప్రభావం బలంగా ఉంటుందని వివరించారు. ఏదేమైనా ఆరుబయలు మలవిసర్జన ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని తేలింది.
– కె.రవికుమార్‌