ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ డిక్లేర్‌

TSCHE  PHOTO
TSCHE

హైదరాబాద్‌: తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విదామండలి విడుదల చేసింది. ఈ నెల 30న కౌన్సిలింగ్‌ ప్రకటనను జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 7 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, సెప్టెంబర్‌ 9 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 17న వెబ్‌ ఆప్షన్లను మార్చుకొనే అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్‌ 20న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. అలాగే సెప్టెంబర్‌ 20న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. అలాగే సెప్టెంబర్‌ 25 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభం అవుతాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది.