ఎడ్యుకేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా

KRUTI SANOON-1
KRUTI SANOON-1

ఎడ్యుకేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా

్జమొదటిసారిగా ఇండియాకు చెందిన ఒక బెస్ట్‌గ్రాడ్యుయేట్‌ హీరోయిన్‌ మరొక దేశానికి ఎడ్యుకేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వహించటానికి రెడీ అయిపోయింది.. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ 1 నేన్కొడినే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన కృతిసనోన్‌.. ఈ అమ్మడు అందంతోనే కాదు చదువులోనూ చాలా బెస్ట్‌ అమ్మానాన్న విద్యావంతులు కావటంతో ఆమె కూడ స్టడీలో ఇంజనీరింగ్‌ పట్టా అందుకుంది.. అది కూడ 90శాతం పైన మార్కులు తెచ్చుకుతంది.. ఆ తర్వాత మోడలింగ్‌లో క్రేజ్‌ సంపాదించుకుని ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తోంది.
విషయానికొస్తే న్యూజిలాండ్‌ దేశం వారు ఈ అమ్మడి అర్హతకీ అందానికీ ఫిదా అయిపోయి ఎడ్యుకేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించినట్టు చెప్పారు.. రీసెంట్‌గా బరేలికి బర్ఫీ అనే సినిమాతో మంచి హిట్‌ అందుకున్న ఈ సుందరాంగి స్టార్‌ హోదాను కూడ వారు పరిగణలోకి తీసుకున్నారట.. తమ దేశంలో ఎడ్యుకేషన్‌సంస్థలు చాలా ఉన్నాయని కృతి ప్రచారకర్తగా ఉండటం వల్ల లాభం చేకూరుతుందనే నమ్మకం వారికి ఉందని తెలిపారు. ఈబాధ్యతలను తాను సక్రమంగా నిర్వహిస్తానని చెబుతోందీ బ్యూటీ.