ఎడతెరిపిలేని వానలతో నీట మునిగిన కేరళ

HEAVY RAIN
HEAVY RAIN

ఎడతెరిపిలేని వానలతో నీట మునిగిన కేరళ

తిరువనంతపురం: కేరళలోని 14 జిల్లాల్లో 11 జిల్లాలు భారీ వరద ముంపునకు గురయ్యాయి. మరో 48 గంటలపాటు కేరళను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణశాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది. ఇడుక్కి, వాయనాడ్‌ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ప్రకటించింది. ఈనెల 14, 15 తేదీలవరకూ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. 13వతేదీవరకూ రెడ్‌ అలర్ట్‌, 15వ తేదీ వరకూ ఆరంజ్‌ అలర్ట్‌లు ప్రకటించారు. కేరళనుంచే కేేంద్ర కేబినెట్‌లోప్రాతినిధ్యం వహిస్తున్న కెజె ఆల్ఫాన్స్‌రాష్ట్రంలోనే మకాంవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మూడురోజులపాటు కుంభవృష్టి కురిసిన వర్షాలు శనివారం కొంత తెరపిచ్చాయి. కేంద్ర ఉపద్రవనివారణ బృందాలు కేరళకు చేరుకుని పునరావాస చర్యలు చేపడుతున్నాయన్నారు.ప్రధానిమోడీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. భారత వాతావరణశాఖ ఇప్పటికే ఇడుక్కి, వాయనాడ్‌ప్రాంతాలకు హెచ్చరికలుజారీచేసింది.

ఇప్పటివరకూ మూడురోజుల వర్షాలకు గాను మొత్తం 54వేల మంది నిరాశ్రయులు కాగా, 37 మంది చనిపోయినట్లు తేలింది. డ్యామ్‌లు, నదులు పొంగి పొర్లుతుండటంతో హైవేలుసైతం కొన్నిచోట్ల విధ్వంసం అయ్యాయి. కోతకు గురయ్యాయి. కొన్ని ఇళ్లుసైతం భారీ వరదనీటికి కొట్టుకునిపోయినట్లు సమాచారం అందుతోంది. శనివారం ఉదయం వరకూ కుంభవృష్టి కురిసిందని వాతావరణశాఖ ప్రకటించింది. 40 ఏళ్ల తర్వాత ఇడుక్కి డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడంతో భారీ ఎత్తున వరదనీరు ముంచెత్తింది. మొత్తం రెండుడజన్లకుపైగా గేట్లను ఎత్తివేసారు.