ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో బలపడిన రూపాయి

RUPEES
RUPEES

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో బలపడిన రూపాయి

ముంబయి,డిసెంబరు 17: భారత్‌రూపాయి నాలుగునెలల గరిష్టస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్రమోడీ పతాకస్థాయిలోప్రచారంచేసిన హిమాచల్‌,గుజరాత్‌లలో బిజెపియే అధి కారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌పోల్‌ అంచనాలే ఇందుకుకీలకమని నిపుణుల అంచనా. అనేక మీడియా సంస్థలు కూడా ఇదే అభిప్రాయాలువ్యక్తంచేయడంతో కరెన్సీ మార్కెట్‌ లో రూపాయి 28 పైసలు పెరిగి రూ.64.06కు పెరిగింది. ఇంటర్‌బ్యాంక్‌ విదేశీ ఎక్ఛేంజి మార్కెట్‌లో రూపాయికి ఎక్కువ గరిష్ట ప్రాధాన్యత లభించింది. గుజరాత్‌లో మొదటి దశ ఎన్నికలు పూర్తి అయినప్పటినుంచి రూపాయి విలువలు పెరుగుతూ వచ్చాయి. ఉదయంపూట ట్రేడింగ్‌లో 14 పైసలు లాభపడి 64.2రూపాయలుగా ఉంది.

అంతకుముందురోజు కూడా ఆర్‌బిఐ డాలర్‌తో రూపాయి మారకం విలువలు 64.27గా నిర్ణయించింది. యూరో విలువలు 75.99గా నిర్ణయిం చింది. ముందురోజు రూపాయి పదిపైస లు లాభపడింది. డాలరుకు 64.34గా పలికింది. 2017 మార్చినాటి ధరలు పలి కాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల విజ యాలను అనుసరించి రూపాయి ఒక్క సారిగా 79పైసలు పెరిగి 16నెలల గరిష్ట స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈఏడాది మార్చి 14వ తేదీ రూపాయి 79 పైసలు పెరిగి 1.2శాతంపెరిగింది.

2013 సెప్టెంబరు 19వ తేదీ డాలరుతో రూపాయి మారకం విలువలు 65.82గా నిలిచాయి. ఇక గతవారంలో సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కూడా భారీ గా పెరిగాయి. నరేంద్రమోడీ ఆధ్వర్యం లోని బిజెపి అధికారంలోనికి వస్తుందన్న అంచ నాలే ఇందుకుకీలకం. ఎగ్జిట్‌పోల్స్‌లో బిజెపికి 182లో 100 సీట్లు వస్తాయని అంచనా వేసాయి. దీనతో బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ 370.91పాయింట్లు పెరిగి 33,617.61 పాయింట్ల కు చేరింది. నిఫ్టీ 50సూచి 10,400పాయింట్లకు చేరింది. 119.55 పాయింట్లు పెరిగాయి.