ఎగ్జిట్‌పోల్స్‌పై సర్వత్రా ఆసక్తి

exit polls 2018
exit polls 2018

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌ శుక్రవారం వెలువడనున్నట్లు అంచనాలు వ్యక్తం కావడంతో ఓటర్లు, రాజకీయ నేతలు అన్నివర్గాల్లోను సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ,రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసిన తర్వాత ఐదు రాస్ట్రాలకు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలవుతుంది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2019లో రిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్నట్లు పార్టీలు అంచనాలకు వచ్చాయి. ఈనేపత్యంలోనే ఎగ్జిట్‌పోల్స్‌ పలితాలపట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంటున్నది. తెలంగాణలోశుక్రవారం జరిగే అసెంబ్లీ ఎన్నికలపోలింగ్‌కు సర్వత్రా సిద్ధంచేసారు.మావోయిస్టుప్రభావితమైన 13నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ముగిస్తారు. తెలంగాణతోపాటు రాజస్థాన్‌ఎనినకల పోలింగ్‌ప్రక్రియను కూడా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకే ముగిస్తున్నారు. ఈ రెండురాష్ట్రాలతోపాటు ఇప్పటికే ముగిసిన మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలోట్ల లెక్కింపును ఈనెల 11న చేపట్టనున్నారు. తెలంగాణ,రాజస్థాన్‌లలో పోలింగ్‌ ముగిసిన తర్వాత ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌పలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలకానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంటున్నది. పలు సర్వేసంస్థలు టివిల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను శుక్రవార ంసాయంత్రంనుంచి అందించేందుకు ప్రసారమాద్యమాలు పోటీపడుతున్నాయి.