‘ఎంసిఎ’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

MCA1
MCA Team

‘ఎంసిఎ’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతోంది.. ఈసినిమా డిసెంబర 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది.. ఈసినిమా థ్రియేట్రికల్‌ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.. దిల్‌రాజు మాట్లాడుతూ, పరీక్షలుపూర్తి, రిజల్టు కోసం వెయిట్‌ చేస్తున్నట్టు యూనిట్‌ అందరూ ఎదురు చూస్తున్నామన్నారు.. టీజర్‌కు, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ ఏడాది మా బ్యానర్‌లో వస్తున్న 6వ చిత్రం ఎంసిఎ అన్నారు. సాయిపల్లవి, ఫిదా తర్వాత చేస్తున్న సినిమా అన్నారు. భూమికగారు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారన్నారు. డైరెక్టర్‌ వేణు, మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు , తన ఎంతో కష్టపడి చేసిన చిత్రమన్నారు.
కార్యక్రమంలో రాజీవ్‌ కనకాల, దర్శకుడు వేణు శ్రీరామ్‌, హీరో నాని తదితరులు మాట్లాడారు.