ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌కు రేవంత్‌ ప్రతిసవాల్‌

Revanth reddy
Revanth reddy

హైద‌రాబాద్ః దమ్ముంటే విద్యుత్‌పై చర్చించేందుకు రావాలంటూ టిఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు మధ్యాహ్నాం 12గంటలకు మేము రె’ఢీ. ఎక్కడికి రావాలో చెప్పండి? ఈ అంశంపై చర్చిస్తామంటే ప్రగతిభవన్‌కు అయినా, సరే వస్తాం. విద్యుత్‌ కోనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను మేము నిరూపిస్తాం. ఎవరు మాట్లాడుతున్నది తప్పో, ఎవరు ముక్కు నేలకు రాయాలో ప్రజలే నిర్ణయిస్తారు అని ధీటుగా రేవంత్‌ స్పందించారు.