ఎంపి కవితకు ధన్యవాదాలు: పవన్‌

pawan
Pawan, MP Kavita

ఎంపి కవితకు ధన్యవాదాలు: పవన్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎంపి కవితకు జనసే అధినేత పవన్‌కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొన్న కవిత అక్కడ మాట్లాడుతూ, జై తెలంగాణ, జైఆంధ్రప్రదేశ్‌ అని నినదించటంతో పాటు ఎపికి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించరాఉ.. ఈనేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న పవన్‌ ట్విట్టర్‌ ద్వారా ఎంపి కవితకు కృతజ్ఞతలు తెలిపారు.. తెలంగాణ, ఎపి కలిసి పనిచేస్తే ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజాసమస్యలకు సులభంగా పరిష్కారాలుదొరుకుతాయన్నారు.