ఎంపిసి కమిటీలోకి డిఫ్యూటీ గవర్నర్‌ వైరల్‌ ఆచార్య

viral
viral

ఎంపిసి కమిటీలోకి డిఫ్యూటీ గవర్నర్‌ వైరల్‌ ఆచార్య

ముంబై, జనవరి 20: పెద్దనోట్ల రద్దుతో తీవ్ర వివా దాలు విమర్శలు ఎదుర్కొన్న ఉర్జిత్‌పటేల్‌కు వడ్డీ రేట్లను నిర్ణయించే మానిటరీపాలసీ కమిటీలో కొంత మద్దతు లభించినట్లయింది. ఇప్పటివరకూ రెండు సమావేశాల్లో వడ్డీరేట్లు తగ్గించేందుకు ఏక గ్రీవంగా నిర్ణయిస్తే డిసెంబరు మానిటరీ సమీక్షలో స్థిరంగా ఉంచేందుకు నిర్ణయించారు. రానున్న నెలల్లో ఎంపిసి వడ్డీరేట్లను తగ్గించాలన్న వత్తిడులు కూడా లేకపోలేదు. ఇప్పటికే సిఐఐ,ఫిక్కీ, అసో చామ్‌ వంటి సంస్థలు ఆర్థిక వ్యవస్థకు తక్కువ వడ్డీరేట్లు ఎంతో అవసరమని వచ్చే ఎంపిసి కమిటీ సమావేశంలో ఆర్‌బిఐ విధిగా వడ్డీరేట్లను తగ్గిస్తుం దన్న అంచనాలు వ్యక్తంచేశాయి. న్యూయార్క్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ మూడేళ్ల కాలానికి ఆర్‌బిఐ డిఫ్యూటీ గవర్నర్‌గా వచ్చిన వైరల్‌ ఆచార్య తన మేధోసంపత్తిని ఉపయోగించి ఎంపిసినిముందుకు నడిపిస్తారని అంచనా. అయితే ఆయన విధులు విధానాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రభుత్వం దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు రంగ బ్యాంకులను అనుమతిం చాలన్న సూచనలు కూడా చేసారు. దీనివల్ల బ్యాం కుల్లో రానిబాకీల వృద్ధి కూడా తగ్గుతుందని అంచ నాలు వేసారు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రానిబాకీలు గుదిబండగామారిన సంగతి తెలిసిందే. 14ఏళ్ల గరిష్టస్థాయికి చేరాయి. ప్రస్తుతం రికవరీకి కూడా మార్కెట్‌ వాతావరణం అనుకూలంగాలేదు.