ఎంపిటిసి దంప‌తుల‌పై హత్యాయ‌త్నం

Attempt Murder
Attempt Murder

సూర్యాపేటః ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో చోటుచేసుకుంది. చింతలపాలెం మండలం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ లకావత్ రామారావు లక్ష్యంగా దాడి జరిగింది. రామారావు లక్ష్యంగా కత్తితో దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తి ఇంటి తలుపుతెరిచిన రామారావు భార్య సుభద్ర( తమ్మారం ఎంపీటీసీ)పై కత్తితో దాడి చేశాడు. పాతకక్ష్యలే ఇందుకు కారణంగా సమాచారం. దాడికి పాల్పడ్డ చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.