ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయఢంకా
ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయఢంకా
16 స్థానాల్లో.. టిఆర్ఎస్-11, కాంగ్రెస్-2, బిజెపి-2
హైదరాబాద్ఫ అధికార టిఆర్ఎస్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పార్లమెంటు..అసెంబ్లీ ఎన్నికలే కాదు..స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ఎదురులేదని నిరూపిస్తోంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన ఎంపిటీసీ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన 16 ఎంపిటీసీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరుగగా.. శనివారం వెల్లడైన ఈ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఘన విజయం సాధించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి…
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్ణాపురం, నిడమనూరు మండలం ఎర్రవెల్లి 2 ఎంపిటీసీ స్థానాల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కిష్టాపురంలో 508 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా ఎర్రబెల్లిలో 568 తేడాతో కాంగ్రెస్‌పై టిఆర్ఎస్ అభ్యర్థి మన్నెం వెంకన్నవిజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ ఎంపిటీసీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి 561 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలిచారు. భద్రాద్రి జిల్లా భద్రాచలం ఎంపిటీసీ 7వ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. సిపిఎం అభ్యర్థిపై 74 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్థి స్వరూప గెలుపొందారు. ఖమ్మం జిల్లా జక్కుపల్లి ఎంపిటీసీ ఉప ఎన్నికల్లో సిపిఎంకు టిఆర్ఎస్ జరిగిన హోరాహోరి పోటీలో టిఆర్ఎస్ విజయం సాధించింది. సిపిఎం అభ్యర్థిపై 228 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని కన్మనూర్ ఎంపిటీసీ ఉప ఎనిన్రక్లో 382 ఓట్లతో టిఆర్ఎస్ గెలుపొందింది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్దిన్నె ఎంపిటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద వెంకటయ్యపై 491 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మిదేవమ్మ గెలుపొందారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ఎంపిటీసీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి లింగమ్మ 451 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.
సర్వ మండలం కన్మకూర్ ఎంపిటీసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి 382 ఓట్ల మెజార్టితో గెలిచారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటలా ఎంపిటీసీ ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి స్వప్ప 450 ఓట్లతో గెలుపు. ఇక కాంగ్రెస్, బిజెపిలు చేరో రెండో విజయం సాధించిన ఎంపిటీసీల వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండంం ఆకునూరు గ్రామ ఎంపిటీసీ 1 ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి బాలనర్సమ్మపై..కాంగ్రెస్ అభ్యర్థి తాటికొండ వేణు 94 ఓట్ల మె జారిటీతో విజయం సాధించారు. ఆచంపల్లి ఎంపిటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 1154 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఎంపిటీసీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రావణ్‌కుమార్ 1252 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.కామారెడ్డి జిల్లా మద్నూర్ ఎంపిటీసీ ఎ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయం సాధించారు.