ఎంపిక చేసిన రంగాల్లో కొనుగోళ్లు

BOMBAY-Stock Market
ఏడాది చివరిలో పెరిగిన స్టాక్‌ సూచీలు
డాలర్‌ వర్సెస్‌ రూపాయి 66.14
ముంబై : బెంచ్‌మార్క్‌ షేర్‌ సూచీలు ఒకటిశాతం పెరిగాయి. ఏడాది చివరిలో స్టాక్‌ సూచీలు ఈనెల 3వ తేదీనాటి గరిష్టస్థాయిని నమోదు చేసాయనే చెప్పాలి. ఫార్మా, ఆర్థికరంగ కంపెనీలు బ్యాంకులు,ఆటోరంగాల్లో కొనుగోళ్లు పెరిగాయి. ఇన్వెస్టర్లు కాంట్రాక్టుడెలివరీల కాలపరిమితి ముగియడంతో కొంతమేర కొనుగోళ్లలో అప్రమత్తంగా వ్యవ హరించారు. డిసెంబరు సిరీస్‌నుంచి జనవరికి బద లాయించుకునే అవకాశం ఉన్నందున ఎంపికచేసిన రంగాల్లోనే కొనుగోళ్లు జరిగాయి. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌195పాయింట్లు ఎగువన 26034 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 7925 పాయింట్లవద్ద ముగిసింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీల్లో కూడా 0.2 నుంచి 0.5శాతంపెరిగాయి. దలాల్‌స్ట్రీట్‌లో పండు గ కళ కనిపించింది. 2015 కేలండర్‌ సంవత్స రంలో కొంతమేరసెన్సెక్స్‌ 26000 పాయింట్లవద్ద నే నిలిచింది. నిఫ్టీ 8000పాయ5ఇంట్లకు ఎగ బాకింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా కొంతమేర సానుకూంలంగానే నడిచాయని సుశీల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్టు రాణక్‌ మర్చంట్‌ వెల్లడించారు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువలు 66.14వద్ద నిలిచాయి. ఇంటర్‌ బ్యాంకు ఫారిన్‌ఎక్ఛేంజిమార్కెట్‌లో రూపాయి ఏడు పైసలు పటిష్టం అయింది.  ఇక దేశీయ మార్కెట్ల లో టెలికాం, మెటల్‌ సెక్టార్లు సానుకూంగా ముగి సాయి. ఫార్మాసంస్థలు డా.రెడ్డీస్‌లాబ్స్‌, సన్‌ ఫార్మా, లూపిన్‌, సిప్లావంటివి ఒకటినుంచి 4శాతం పెరిగాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 0.6శాతం పెరి గింది. రిలయన్స్‌జియో ఆదివారం వైర్‌లెస్‌బ్రాడ్‌ బ్యాండ్‌సేవలు ప్రారంభించడమే ఇందుకుకీలకం. భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులర్‌ సంస్థలు ఒత్తిడికి లోనయ్యాయి. ఈ రెండుకంపెనీల షేర్లు 1-2శాతం చొప్పున క్షీణించాయి. టాటా మోటార్స్‌ మూడు శాతం పెరిగాయి.  కోల్‌ ఇండియా ఒకటిశాతం పెరిగింది. ఐటిసి, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, హెల్త్‌కేర్‌ ఉత్పత్తులపరంగా పెరిగాయి. ఐటిసి శావలోన్‌బ్రాండ్‌ను పెంచుతోంది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ తన లైఫ్‌బా§్‌ు హ్యాండ్‌వాష్‌ను మరింత విస్తృతం చేస్తోంది. ఐటిసిఒకటిశాతం, హెచ్‌యుఎల్‌ 0.5శాతం పెరిగాయి. నష్టాలపరంగాచూస్తే టాటా స్టీల్‌, భారతిఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డి ఎఫ్‌సి, ఆసియన్‌ పెయింట్స్‌ వంటివి 1-3శాతం వరకూ నష్టపోయాయి. స్పైస్‌జెట్‌ నాలుగురోజుల ఏడాది చివరి ఆఫర్‌నుప్రకటించింది. 716రూపాయ లకే ప్రయాణం ఆఫర్‌చేసింది. జనవరి 15నుంచి ఏప్రిల్‌ 12వతేదీల మధ్య ప్రయాణాలు చేసేందుకు వీలవుతుంది. స్పైస్‌జెట్‌ షేర్లు నాలుగుశాతంపెరిగా యి. ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 11శాతంపెరిగాయి. 14శాతం చోళమండలం ఎంఎస్‌ జనరల్‌బీమా వాటాను జాయింట్‌ వెంచర్‌లో మిత్యుయి సమి టోమో ఇన్సూరెన్స్‌కు 883కోట్లకు విక్రయించింది. కెఇఐ ఇండస్ట్రీస్‌ ఎనిమిదిశాతం పెరిగాయి. 384.53కోట్ల విలువైనపవర్‌గ్రిడ్‌కార్పొరేషన్‌ ఆర్డర్లు సాధించినట్లు ప్రకటించడం వల్లనే పెరిగాయి.