ఎండ వేడిమికి, జ్వరానికీ తేడా?

fever
fever

పిల్లలకు జ్వరం అనేది సాధారణంగా వస్తుంటుంది.జ్వరం వచ్చినప్పుడు పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనడం కూడా సహజం అయితే ఎలాంటి జ్వరాలకు ఆందోళన చెండాలి,ఒక్కోసారి ఎండవేడికి కూడా పిల్లల్లో ఉష్ణోగ్రత పెరుగుంటుంది.బాగా ఆటలాడి అలసిపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంటుంది కాంగారు పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు పిల్లల్లో జ్వరాలు,వాటి లక్షణాలు తెలుసుకుందాం.ఎక్కువగా పిల్లలకు మలేరియా జ్వరాలు వస్తుంటాయి.జ్వరం వచ్చన జర్వం ఎక్కువగా పిల్లలకు మలేరియా జ్వరాలు వస్తుందటాయి.ఇంకా వైరస్‌ సంబంధమైన చికున్‌గున్యా డెంగ్యూ ఫీవర్లు వస్తుంటాయి.కానీ జ్వరం అనేది శరీరస్పందన దానికి ఫిట్స్‌తో సంబంధం ఉండదంటున్నారు పిల్లల వైద్యనిపుణులు 18 ఏళ్లు దాటిన పిల్లల్లో సాధారణ ఉషోగ్రత 98.6 ఫాలన్‌హీట్‌ ఉంటుంది.జీవప్రక్రియ వల్ల అలా ఉంటుంది.జ్వరం వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే ఆందోళన పడకూడదు మెదడులోని హైపోతలమన్‌లో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం ఉంటుంది.ఐదేళ్లలోపు పిల్లల వరకు ఈ కేంద్రానికి సరైన నియంత్రణ శక్తి ఉండదు.అందువల్ల ఒక్కోసారి ఎక్కువ జ్వరం వస్తున్నట్లు కనిపిస్తుంది.మెదడులో జబ్బులు లేకపోయినా ఒక్కొక్కసారి పిల్లలకు వచ్చే జర్వాల్లో వైరల్‌ సంబంధమైనవి,యుటిఐ వల్ల వచ్చేవి.ధర్మామీటర్‌ను ఎలా వాడాలి చంక భాగంలో ధర్మామీటర్‌ ద్వారా తెలుసుకున్న ఉష్ణోగ్రతలో ఒక డిగ్రీని తగ్గించుకుని లెక్కవేసుకోవాలి.అలాగే నోట్లో ధర్మామీటర్‌ పెట్టి చూసినప్పుడు టెంపరేచర్‌ తక్కువగా ఉంటుంది.కాళ్లూచేతులు చల్లగా ఉండి,ఉదరభాగం వెచ్చగా ఉంటుంది.ఎక్కువసార్లు మూత్రం పోస్తున్నట్లుయ వుంటే దాన్ని యూటిఐమూత్రసంబంధవ్యాధిగా గుర్తించాలి.దగ్గు జలుబు వున్నప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్‌ ఉందో లేదో గుర్తించాలి.ఇంటిలో అందరికి జ్వరం వచ్చినట్లయితే అది వైరల్‌ సంబంధ జబ్బుగా భావించాలి.పిల్లలకు ఒకసారి వచ్చిన జ్వరం మళ్లీ వచ్చినట్లయితే సమీపంలోని చిన్న పిల్లల వైద్యనిపుణుల్ని కలవాలి.ఆయన సహా మేరకు ముందులు వాడాల్సి ఉంటుంది.జ్వరం వచ్చినప్పుడు చల్లగాలి మంచి వెలుతురు ఉన్నట్టయితే త్వరగా కోలుకుంటారు.తడిబట్టతో శరీరమంతా పూర్తిగా తుడవాలి.15 నిమిషాల కాలంలో ఒకటి రెండు డిగ్రీలు తగ్గి సాధారణ టెంపరేచర్‌కు శరీరం చేరుకుంటుంది.వణుకుతున్నట్లయితే శరీరంలోని వేడి బయటకు వెళ్లేలా వంటి వీపు వీద ఉన్న బట్టల్ని తొలగించాలి.వ్యాధినిర్థారణకు సిబిసి,టిఎల్‌సిడిల పరీక్షలు చేయించాలి.మొత్తంలో చీము కణాలు ఏ మేరకు వున్నాయో తెలుస్తుంది.కొన్ని మందుల దుష్పరిణామాల వల్లకూడా టెంపరేచర్‌ పెరుగుతుంది.జ్వరం లేనప్పుడు మందులు వాడకూడదు.