ఎండవేడికి కళ్లు మండుతున్నాయా?

Summer
Summer

ఎండవేడికి కళ్లు మండుతున్నాయా?

వేసవి కాలంలో ఎండలో బయట తిరుగుతున్నప్పుడు సహజంగానే కళ్లు మంటపుడతాయి. కొన్నిసార్లు నీళ్లు కూడా కారతాయి. వేడివల్ల కళ్లు ఎర్రగా మారడం, మంటపుట్టడం వంటి కొన్ని కంటి ఇబ్బందులకు గురవ్ఞతుంటాం. అంతేకాక రోజువారీ అధిక శ్రమ, ప్రొద్దునే లేవటం, అర్థరాత్రి వరకూ టివిలు చూడడం లేట్‌ నిద్రకు కారణమేదైనా సరే పొద్దునే సమయానికి లేస్తేనే పనులు సక్రమంగా జరుగుతాయి. లేకపోతే టెన్షన్‌ టెన్షన్‌. ఇలా రోజూ ఒత్తిడి ఎక్కువయితే రకరకాల సమస్యలతో నిద్రలేమి తోడయి కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వీటిని ప్రారంభంలోనే గమనించి శ్రద్ధ తీసుకుంటే మంచిది. వేసవిలో కళ్లు మంటపుట్టకుండా, కంటికింద వలయాలు రాకుండా కొన్ని జాగ్రత్తలను పాటిస్తే సరి. వదిలేస్తే అవి బాగా ముదిరి మరింత నల్లగా మారి శాశ్వతస్థానాన్ని పొందే అవకాశాలెక్కువ. ఈ వలయాలు కూడా కొంతమందికి వంశపారంపర్యంగా వస్తాయి. ఆస్తులు, హోదాలు, పెద్దల నుంచి తరాల నుంచి వచ్చినా రాకపోయినా ఇవి మాత్రం ఆటో మాటిక్‌గా వస్తాయి. కొంతమందికి ముక్కు నుంచి రక్తం కారుతుంది. దానివల్ల కూడా ఈ వలయాలు ఏర్పడవచ్చు.

కనులు, కనురెప్పలు ఉబ్బడం, వాపుల వల్ల కూడా నల్లటి వలయాలు వస్తాయి. నివారణకు ్య నీటిని ఎక్కువగా తాగుతుండాలి. ్య ఒత్తిడి కలిగించే సంఘటనలకు, విషయాలకు దూరంగా ఉండండి. నిద్ర విషయంలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. ్య ముఖానికి రాసుకునే క్రీములు, లేదా చేయించుకునే ఫేషియల్స్‌, వేసుకునే ప్యాక్స్‌ కళ్ల కింద వేసుకోకుండా, తగలకుండా జాగ్రత్తపడండి. కళ్ల కింద రాసే క్రీములు పదినిమిషాలలోపే కడిగేసుకోండి. ఎలాంటి మంచి క్రీమ్‌ అయినాగాని, ప్రకృతి సిద్ధమైనవిగాని ఎక్కువసేపు ఉంచుకోకండి.

మీరు పడుకునే సమయంలో పచ్చిదోసకాయగాని, బంగాళా దుంప బద్దలని గాని కళ్లు మూసుకుని కనులమీద, కనురెప్పలు మీద పదినిమిషాలు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. త్వరగా మచ్చలు పోతాయి. ్య టివిని ఎక్కువగా చూడకుండా మంచి సంగీతం వింటూ ఆనందాన్ని ఆస్వాదించండి.

దోసకాయ రసం, బంగాళాదుంపల రసం సమపాళ్లలో తీసుకోండి. శుభ్రమైన కాటన్‌గుడ్డను అందులో ముంచి కనులు మూసుకుని ఆ క్లాత్‌ను కళ్లమీద కనుబొమల క్రింద కూడా కవర్‌ అయ్యేలా వేసుకోండి. ముఖమంతా కారకుండా క్లాత్‌కు మాత్రమే రసం అంటేలా చూసుకోండి. లేదంటే ముఖమంతా కారి మెడలవరకూ వచ్చి జారి చికాకు పెడుతుంది. ఇరవై నిమిషాల తర్వాత వాష్‌ చేసుకోండి. ్య నిమ్మపండు రసం, టమాటారసాలను సమపాళ్లలో తీసుకుని నల్లటి వలయాలపై రోజూ రెండుసార్లు ఉదయం పదకొండు గంటలకి, సాయంత్రం నాలుగు గంటలకి వ్రాసుకోండి.

పైనాపిల్‌ రసంలో పసుపు కలుపుకుని పేస్ట్‌లా చేయండి. దీన్ని కూడా నల్లటి వలయాలపై రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి. ్య పుదీనా ఆకులు బాగా చిదిమి ఆ ఆకులను వలయాలపై మృదువ్ఞగా అద్ది కొద్దిసేపు ఉంచుకుని వాష్‌ చేసుకోండి.

రాత్రి నిద్రపోయే ముందు ఆల్మండ్‌ నూనెను కళ్ల కింద వలయాలపై రాసి మృదువ్ఞగా చేతివేళ్లతో మసాజ్‌ చేయండి. చక్కటి ఫలితం వస్తుంది. ఇలా చేసేకొద్ది నల్లటి వలయాలు కనుమరుగవుతాయి. ఈ నల్లటి వలయాలకి విరుగుడు ఆల్మండ్‌ అయితే, ఇది ఈ వలయాల మీద అత్యంత ప్రభావం చూపి అవి కనపడకుండా చేయడంతో పాటు అక్కడ చర్మానికి మంచి బలం సుకుమారం, సున్నితత్వం కూడా ఇస్తుంది. రాసుకునేటప్పుడు కళ్లకి తగలకుండా జాగ్రత్తగా రాసుకోవాలి.

చల్లటి గుడ్డ వేడినీటిలో ముంచిన క్లాత్‌ తీసుకోండి. రిలాక్స్‌గా పడుకుని, ఒకదాని తర్వాత ఒకటి మార్చి మార్చి మారుస్తూ ముఖం కవర్‌ చేయండి. ఇలా పదిహేను నిమిషాలు చేసి జస్ట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ సుతారంగా కంటి కింద వలయాల మీద రాయండి. ్య ఆక్యుప్రెజర్‌లో కళ్లకు సంబంధించిన స్థానం చూపుడు వేలు, కళ్లమీద, కళ్లకింద ఏదైనా రాయాల్సి వచ్చినపుడు చూపుడువేలుతో అప్లయి చేయటం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుందని తెలియ చెబుతోంది. ఏదైనా సరే ఈ భాగాల్లో ఎక్కువ ప్రెజర్‌ ఉండకూడదు. చాలా సున్నితమైనవి. కాబట్టి ఎక్కువగా వీటికి విశ్రాంతినిస్తూ ఉండాలి.

కళ్లకింద వాపుల నివారణకు
రాత్రిపూట పడుకునేటప్పుడు తల కొంచెం ఎత్తులో ఉండేటట్లు చూసుకోండి. ఇలా పడుకోవటం వల్ల ద్రవాలు కళ్ల కిందకు జారకుండా ఉంటాయి. కళ్ల కింద వాపు రాదు. ్య విటమిన్‌ ఇను గాని ఆలివ్‌ నూనెను గాని రాయండి.

బంగాళాదుంప గుజ్జును ఒక గుడ్డలో కట్టి కంటి కింద పావ్ఞగంట నుండి ఇరవై నిమిషాల వరకూ ఉంచుకోండి. ్య బాగా చల్లగా ఉన్న దోసకాయ బద్దలను ఇరవై నిమిషాల పాటు కళ్లకింద పెట్టుకోండి.

షవర్‌ కింద పావుగంటసేపు నుదుటమీద నుంచి కళ్లమీదుగా నీరు జారేలా నిలబడి ఉండండి.