ఊరు పేరే ఇంటి పేరుగా…

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ శ్రీనివాసరెడ్డి ఇంటిపేరు పోచారం కాదని, ఆయన ఇంటిపేరు పరిగె అని, స్వగ్రామం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప వ్యక్తి ఆయనని సియం కేసిఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ రోజు అన్ని పేపర్లలో స్పీకర్‌గా పోచారం అని రాశారు ,అంటే అంతగా ఊరు పేరు ఇంటి పేరుగా వచ్చేంత నిస్వార్ధ సేవను అందించారని సియం కేసిఆర్‌ అన్నారు. స్పీకర్‌గా తమరు ఎన్నికైన సందర్భంగా పోచారం గ్రామస్థులు ధన్యులయ్యారని అన్నారు. ఆయన ప్రజా జీవితంలో పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారని, వినయశీలిగా, వివాద రహితుడిగా చక్కటి సేవలందించారని, వచ్చే ఫిబ్రవరి 10తో 70వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారని అన్నారు.