‘ఊపిరి ట్రైలర్ విడుదల
‘ఊపిరి ట్రైలర్ విడుదల
సోగ్గాడే చిన్ని నాయనా.. వంటిసూపర్ హిట్ చిత్రంతో రూ. 50 కోట్ల క్లబ్లో చేరిన కింగ్ నాగార్జు, ‘ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమా పతాకంపై దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఊపిరి. తెలుగు, తమిళ భాషల్లో పరమ్ విపొట్లూరి , కవిన్ అన్నే నిర్మిస్తున్న ఈ భారీ మల్లీస్టార్ చిత్రం ట్రైలర్ను అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కలిసి గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. అఖిల్ మాట్లాడâత, రెండు సంవత్సరాలుగా ఈసినిమా కోసం పనిచేశారు. ఆ డెప్త్ ఈ ట్రైలర్లోనే కన్పిస్తోందన్నారు. మా నాన్నే మా ఊపిరి మా హీరో అలాంటి నాన్న కుర్చీకలోనే కూర్చొవటం ఏంటని అసలు ఈ సినిమాలో నటించొద్దని చెప్పామన్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యానన్నారు. వంశీ మంచి కథ ఇచ్చారన్నారు. సినిమాటోగ్రాఫర్ వినోద్ ఈసినిమాకు బ్యాక్ బోన్ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎమోషనల్గా అన్పించిందన్నారు. ఇంత మంచి స్క్రిప్టు అందించిన వంశీకి థ్యాంక్స్ అని అన్నారు. దర్శకువు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ నాగార్జు, పివిపి, కార్తీల నమ్మకమే ఈసినిమా అన్నారు. గట్స్ ఉన్న నిర్మాత కావాలి.. పివిపిగారు ఎంతో నమ్మకంతో సినిమా చేశారన్నారు. పారిస్లో సినిమాలోచిత్రీకరించామన్నారు. మంచి జర్నీలా ఈసినిమా మాజీవితాల్లో మిగిలిపోతుందన్నారు. నిర్మాత పివిపి మాట్లాడుతూ ఈ సినిమాను మార్చి 25న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. నాగార్జున కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందన్నారు. రెండు భాషల్లో కలిపి సుమారుగా రూ.50 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించామన్నారు. పారిస్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశామని మంచి టెక్నీషియన్లతో కలిసి ఈసినిమాను నిర్మించానని అన్నారు. సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెన్నెల, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వినోద్, ఎడిటింగ్: మధు, మాటలు: అబ్బూరి రవి.