ఉసిరి మనకెంతో మంచిది

Gooseberry
ఉసిరి మన దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ లభ్యమవుతాయి. ఉసిరి చెట్టు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్న కాయలు, రెండవది పెద్ద కాయలు కాస్తుంది. ఉసిరికా యలో ప్రధా నంగా ఆమ్లరసం ఉంటుంది. ఆల్బుమిన్‌, సెల్యు లోజ్‌, కాల్షియం ఉంటాయి. ప్రతి ఉసిరి కాయలో 450మి.గ్రా. విటమిన్‌ సి ఉంటుంది.
ఔషధ గుణాలు : ఉసిరి కళ్లకు చలువ చేస్తుంది. అన్ని మేహ వ్యాధులను, పైత్యాలను తగ్గి స్తుంది. మూల వ్యాధిని అరికడుతుంది. జీర్ణశక్తిని పెంపొందించి ఆకలిని పెంచుతుంది. మేధ స్సును పెంచి బుద్ధి బలాన్ని చేకూరుస్తుంది. ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. వీర్యపుష్టిని చేకూరుస్తుంది. సంతానో త్పత్తికి తగిన బలాన్ని కలిగిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ఉసిరి కాయను చికిత్సలోవాడే సమయంలో మోతాదు ఇలా ఉంటుంది. చూర్ణం 3 నుంచి 6 గ్రాములు, స్వరసం 10 నుంచి 30 మి.లీ. చొప్పున తీసుకోవాలి. ఉసిరిక పొట్టు, నిమ్మర సం సమ భాగాలుగా తీసుకుని నీటితో మెత్తగా మర్దించి తలకు రాసుకుంటే కళ్లకు చల్లదనం కలుగుతుంది. తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. జుత్తు రాలిపోవడం తగ్గుతుంది.