ఉల్లాసంగా, ఉత్సాహంగా

                             ఉల్లాసంగా, ఉత్సాహంగా

HAPPY
HAPPY

ప్రతిరోజు అన్ని పనులు మామూలుగానే చేస్తుంటాం. అయితే చేస్తున్న పనిలో మన శారీరక మానసిక శక్తి సామర్ధ్యాలు వందశాతం వినియోగించు కుంటున్నామా అంటే- ‘అవును అని తడుముకోకుండా వెంటనే సమాధానం చెప్పలేము. నిత్య జీవనంలో ప్రతి నిమిషమూ ఉల్లాసం ఉత్సాహం పరవళ్లు తొక్కుతూ ఉండాలంటే మాత్రం చాలా కష్టమే. అనారోగ్యం ఏమీ లేకపోయినా ఎడతెగని ఆలోచనలు, దిగుళ్లు, విసుగు, నిరాశ ఇలాంటివన్నీ మనలోని సహజశక్తిని హరించి వేస్తుంటాయి. వీటన్నింటినీ అధిగమించి నూరుశాతం నిత్యోల్లాసం మీ సొంతం చేసుకోవాలంటే-
్జ సౌందర్య సాధనాలు అన్నిటితో పాటు నిద్రకూడా ముఖానికి మంచి కళని తెస్తుంది. అంతేకాదు మనసుకి కూడా. త్వరగా నిద్రపోయి, తొందరగా నిద్రలేవటం ఆరోగ్యదాయకమైన లక్షణమన్న సంగతి మనందరికీ తెలిసిందే.
్జ మీ కంటికి తరచుగా వెలిగిపోయేలాంటి రంగులు కనిపించేలా చూసుకోండి. ధరించే బట్టలు, గది గోడలు, కర్టెన్లు మొదలైన వాటికి ఇలాంటి రంగులు ఎంపిక చేసుకోండి. ఆరంజ్‌, పసుపు వంటివి ఆనందం, ఉత్సాహం కలిగించే రంగులు.
్జ వారానికి ఒకసారైనా గుండె కొట్టుకునే వేగం పెంచే ఎక్సర్‌సైజులు చేయటం మంచిది. నాట్యం, ఈత, జాగింగ్‌, మెట్లు వేగంగా ఎక్కడం వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి.
్జ నవ్వడం, అదీ పెద్ద గొంతుతో నవ్వడం అప్పటికప్పుడు ఉత్సాహం శక్తినిచ్చే సాధనంగా చెప్పవచ్చు. వారంలో ఒక రోజుని పూర్తిగా మీకోసం కేటాయిం చుకోండి. ఆ రోజు మీ కిష్టమైన పనులు చేయటం, నచ్చిన వారితో సమయం గడపటం, చిన్నపిల్లల్లా మారి పోయి చిందులు వేయటం చేయండి.