ఉల్ఫా దాడిలో మృతిచెందిన వారికి ఎక్స్‌గ్రేషియా

ULFA ATTACKS IN ASSAM
ULFA ATTACKS IN ASSAM

టిన్సుకియా: దోలా-సదియా బ్రిడ్జ్‌ వద్ద ఉన్న బిష్ణోముఖ్‌ గ్రామంలో ఉల్ఫా ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు స్థానికులు మృతిచెందారు. ఆ దాడిలో మృతిచెందిన ఐదుగురు కుటుంబాలకు అస్సాం రాష్ట్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి కేశబ్‌ మహంత తెలిపారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇవాళ స్థానిక మహిళలు దోలా హైవేను స్తంభింపజేశారు.