ఉర్జీత్ రాజీనామా చేయాలిః వెంక‌టాచ‌లం

URJIT
URJIT

న్యూఢిల్లీః పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ భారత రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.హెచ్‌ వెంకటాచలం డిమాండ్‌ చేశారు. రూ.11,400కోట్ల రుణాలను ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండటంలో ఆర్‌ బీఐ గవర్నరు ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులపై పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని, ఆర్‌బీఐ నిర్లక్ష్యం, వైఫల్యం ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆయన విమర్శించారు.