ఉరుముతున్న ఉగ్రవాదం

Mavoists
Mavoists

ఉరుముతున్న ఉగ్రవాదం

కాశ్మీర్‌ ఎప్పటికీ రావణకాష్టంలా రగులు తూ ఉండాలనేదే పాకిస్థాన్‌ వ్యూహం. అందులో భాగంగానే కాశ్మీర్‌లోకి పెద్దఎత్తున ఉగ్రవాదుల చొరబాటును ప్రోత్సహిస్తూనే ఉంది. కా ల్పుల ఒప్పందాన్ని కాలరాస్తూనే ఉంది. ఇటీవల కాలంలో వరుసగా దాదాపు నూటనలభైసార్లకుపైగా కాల్పులకు తెగ బడింది. తాజాగా శనివారం వేకువజామున సాయుధులైన జైషీమహ్మద్‌ ఉగ్రవాదులు సైనిక శిబిరంలోకి చొరబడి విచ క్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందా రు.

ఈ ఉగ్రదాడిని ఎదురొడ్డే ప్రయత్నంలో ఇద్దరు సుబేదా రులు కూడా మరణించారు. శనివారం సాయంత్రం వరకు కొనసాగిన కాల్పుల్లో చివరకు ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుపెట్టాయి. వారి నుంచి ఎకె-56 రైఫె ల్స్‌, గ్రైనెట్‌ లాంచర్‌, గ్రైనెడ్‌లు పెద్దఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఆర్మీ కుటుంబాలను తరలించే కార్యక్రమం కొనసాగిస్తుండగా ఒక జవాను, ఆయన తండ్రి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మరణించిన వారి సంఖ్య ఆరుకి పెరిగినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఆరుగురు మహిళలు పిల్లలతోసహా పది మంది గాయపడ్డారు.

ఈ దాడిని హోంమంత్రి రాజ్‌ నాథ్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు. సైనిక కుటుంబాలకు ప్రజలంతా మద్దతుగా ఉండాలని పలువురు జాతీయ నేతలు పిలుపునిచ్చారు. రాజోరీ, పూంజ్‌ జిల్లాల్లో సరిహద్దు రేఖ వెంబడి ఉన్న గ్రామాలపై పాక్‌ సైన్యం కాల్పులు జరుపుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఆ ప్రాంతంలో ఒక వృద్ధురాలు మరణిం చినట్లు సైనిక వర్గాలు చెప్తున్నాయి. సైనిక కుటుం బ సభ్యుల్లో చాలా మంది ఇప్పటికి అక్కడి ఇళ్లల్లోనే ఉన్నా రని, సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కొనసా గుతుందని జమ్మూలో హై అలర్ట్‌ ప్రకటించినట్లు కూడా జమ్మూకాశ్మీర్‌ డిజిపి ఎస్పీ వైద్‌ వెల్లడించారు.

ఏదిఏమైనా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని ఉంది. పాకిస్థాన్‌ ఇలా సరిహద్దు వెంబడి తరచుగా ఒప్పందానికి విరుద్ధంగా కాల్పులు జరపడం సాధారణమైపోతున్నది. ఒకపక్క ఉగ్ర వాదులను దేశంలోకి చొప్పిస్తూ మరొక పక్క సరిహద్దు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడేందుకు పాక్‌ వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నదనే దాంట్లో సందేహం లేదు. ఉగ్రవాదులను పాక్‌ పెంచి పోషిస్తుందనే విషయంలో ప్రపంచదేశాలు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా పాకిస్థాన్‌పై కన్నెర్ర చేసింది. ఇప్పటికే వారు పాకిస్థాన్‌కు అందిస్తున్న సహాయ సహకారాల విషయంలో ఆంక్షలు విధించడమేకాక బహి రంగంగానే హెచ్చరించింది.

ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, ఉగ్రవాదులను మట్టుపెడుతున్నా ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఉగ్రవాదుల దాడుల్లో అల్లాడుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని చెప్పొచ్చు. ఎక్కడో ఒక చోట ఈ దాడులు జరు గుతూనే ఉన్నాయి. బాంబు పేలుళ్లతో ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూనే ఉన్నారు. వారిని నిరోధించలేక నిఘా సంస్థలు పట్టుకోలేక పోలీసు వ్యవస్థలు తమ బలహీనతలను చాటుకుంటూనే ఉన్నాయి.

మొన్న పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తులో ఉన్న ఉగ్రవాదిని పక్కా పథకం ప్రకారం ఉగ్రవాదులు దా డులు చేసి తప్పించి తీసుకుపోయారంటే భద్రతా విభా గానికే ఒక సవాల్‌ విసిరినట్టు అయింది. ఒక ఉగ్రవాదిని పట్టుకోడానికి ఎన్ని ఏళ్లు, ఎన్ని రకాలుగా వ్యూహాలు పన్నాలో,ఎంత సమాచారం సేకరించాలోతెలియంది కాదు. ఇన్ని వ్యయప్రయాసాలకు ఓర్చి పట్టుకున్న ఉగ్రవాదిని ఒక క్షణం పాటులో తప్పించి తీసుకుపోయారంటే అక్కడి పోలీ సుల సమర్థత చెప్పకనే చెబుతున్నది. ఒకరకంగా చెప్పా లంటే మనదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోవడా నికి, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోవడానికి పోలీ సులవైఫల్యమే కారణమని చెప్పొచ్చు. పోలీసులు దశాబ్దాల తరబడి ఉగ్రవాదులతో పోరాడుతున్నా వారి కదలికలను సమాచారాన్ని పసికట్టి నియంత్రించడంలో మాత్రం ఆశిం చిన ఫలితాలు సాధించలేకపోతున్నారు.

ఉగ్రవాదుల్లో పట్టు బడుతున్న వారి సంఖ్య ఒక్క శాతం కూడా లేకపోగా ఆ పట్టుబడిన వారిని కూడా తప్పించి తీసుకుపోతున్నారు. మనదేశంలో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపి అసలైన నిందితులను అదుపులోకి తీసుకోవడంలో అంత సామర్థ్యం పోలీసులు కనబరచలేకపోతున్నారనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. నిఘావర్గాలు అప్రమత్తంగా ఉంటే కొంతమేరకైనా వీటిని నియంత్రించే అవకాశం ఉంది.

భారత ఆర్థిక రాజధాని ముంబాయిలో 2008లో జరిగిన దాడి యావత్‌ జాతిని నివ్వెరపరిచింది. దాదాపుమూడు రోజుల పాటు జరిగిన ఈ కాల్పుల కాండ ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఆ కాల్పుల్లో విదేశీలయులతోసహా నూటయాభైఐదు మందికి ిపైగా నిహితులైనట్లు మరో నాలుగువందల మంది క్షతగా త్రులయ్యారు. ఇందులో పాకిస్థాన్‌ హస్తం ఉందని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నిర్ధారణ అ యింది. అలాగే మన రాష్ట్రంలో జరిగిన దాడుల్లో కూడా అనేక మంది మరణించడం మరెం దరో గాయపడ్డారు.

నేటికీ అందుకు కారకులైనవారిని ప్రత్య క్షంగా పాల్గొన్న వారిని పోలీసులు కనుగొనలేకపోయారనే విమర్శలు వినిపి స్తున్నాయి. ఆనాటి ప్రధాని ఈ దాడుల గురించి ముఖ్యం గా ముంబాయి దాడి గురించి ప్రస్తావిస్తూ జాతీయ భద్రత చట్టాన్ని మరింత పటిష్టంగా వినియోగించ డంతోపాటు ఫెడరల్‌ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించా రు. ఎన్ని చట్టాలు తెచ్చినా, మరెన్ని సంస్థలను ఏర్పాటు చేసినా వాటిని అమలు చేయాల్సింది ఉన్న పోలీసులనే విషయాన్ని విస్మరించకూడదు. సరిహద్దు వద్ద ప్రాణాలకు తెగించి కాపాడుతున్న సైనికులకు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆయుధ సామగ్రిని అవసరం మేరకు సమకూర్చా లి. అలాగే ఉగ్రవాదుల విషయంలో ఉక్కు పాదం అంటూ మాటల్లోకాక చేతల్లో చూపాలి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌