ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వం!

Mayawathi
Mayawathi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రానున్న ఉప ఎన్నికల్లో ఇకపై ఏ పార్టీకిలేదా ఏ అభ్యర్ధికిసైతం మద్దతివ్వకుండా పనిచేస్తుందని ఆపార్టీ అధినేత్రి మాయావతి స్పష్టంచేసారు. కైరానా ఉప ఎన్నికలు రానున్న తరుణంలో బిఎస్‌ఇ అధినేత్రిచేసిన వ్యాఖ్యలు కీలకం అయ్యాయి. ఫుల్పూరు, గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బిఎస్‌పి పార్టీకేడర్‌ మొత్తం సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధులతరపున పనిచేసి బిజెపిని ఓడించేందుకు కృషిచేసిన సంగతి తెలిసిందే. తన పార్టీ నాయకులతో తాజాగా నిర్వహించిన సమావేశంలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన మాయావతి మాట్లాడుతూ బిఎస్‌సి, ఎస్‌పి పొత్తు 2019లో రానున్న సార్వత్రిక ఎన్నికలకోసమేనని గోరఖ్‌ఫూర్‌తరహా ఎన్నికల అవగాహణ ఇకపై ఉండబోదని అన్నారు. కైరానా పార్లమెంటరీ నియోజకవర్గానికి సైతం త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నందున మాయావతి పైవిధంగా వ్యాఖ్యలుచేసారు. బిజెపని ఎంపి హుకుమ్‌సింగ్‌మరణంతో ఈ సీటుకు ఉప ఎన్నికఅనివార్యం అవుతున్నది. అంతేకాకుండా నూర్పూర్‌ అసెంబ్లీ స్థానంలో జరిగే ఉప ఎన్నికకుపైతం బిఎస్‌పి ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ సీటులో బిజెపి ఎమ్మెల్యే రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇటీవలి ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల్లో బిఎస్‌పిఅభ్యర్ధిని గెలిపించడంలో ఎస్‌పి అధినేత అఖిలేష్‌ యాదవ్‌ విఫలం కావడం వల్లనే ఈ విధమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని బిఎస్‌పి మద్దతుదారులు చెపుతున్నారు. మాయావతి తనమద్దతుదారులతో సమావేశంలో మాట్లాడుతూ పార్టీ యంత్రాంగాన్ని ప్రక్షాళనచేయాలని, గడచిన కొనిసంవత్సరాలుగా పూర్తిగా మసకబారిన ప్రతిష్టను తిరిగి తీసుకువస్తామని అన్నారు. స్వామిప్రసాద్‌ మౌర్య, నసీముద్దీన్‌ సిద్ధికీ వంటివారు వైదొలిగినతర్వాత పార్టీని పూర్తిగా మారుస్తామని అన్నారు. మౌర్య బిజెపిలో చేరి కేబినెట్‌మంత్రిగా బాధ్యతలుచేపసట్టారు. సిద్ధికి బిఎస్‌పినుంచి ఒకేసారి ఎన్నికకాగా కాంగ్రెస్‌ పార్టీవైపుకు వెళ్లిపోయారు. పార్టీ అంతర్గత వేగుల వివరాలప్రకారం బిఎస్‌పి సుప్రీమో ఇప్పటికిప్పుడు పార్టీని పటిష్టంచేయడంతోపాటు తన చిరకాల ప్రత్యర్ధిగా నిలిచిన సమాజ్‌వాది పార్టీతో కార్యసాధక పొత్తును కుదుర్చుకుని బిజెపిని ఓడించే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈపార్టీపై మరింతగా ఆధారపడకుండా పొత్తును కొనసాగించాలనినిర్ణయించారు.