ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు

Teachers Suspend
Teachers Suspend

బరంపురం: ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో గంజామ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కల్గికోటేబ్లాక్‌లో పలు పాఠశాలల్లో విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న ముగుగరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసినట్లు బ్లాక్‌ విద్యాశాఖాధికారి ఒకరు తెలిపారు. జిల్లా పర్యవేక్షక కమిటీ ఆయా పాఠశాలలను సందర్శించి ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసినట్లు డిఈవో సనాతన్‌ పాండా తెలిపారు.