‘ఉపాధి’కే క‌ట్టుబ‌డ్డాం

rahul gandhi
rahul gandhi

దేశానికి అవినీతిని బహుమతిగా ఇచ్చిన మోడీ,పట్నాయక్‌
ఉపాధిహామీతో ప్రతి ఒక్కరికీ కనీసాదాయం
ఒడిశా ప్రచారంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌
భవానిపాట్నా(ఒడిశా): దేశంలోని ప్రతి ఒక్కరికితాము యుపిఎ హయాంలోప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మించిఉపాధి హామీని అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆపథకంతోపాటే ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేవిధంగా కాంగ్రెస్‌కృషిచేస్తుందని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపేర్కొన్నారు. ఎన్నికలకు వస్తున్న ఒడిశాలో రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌, ప్రధాన మంత్రినరేంద్రమోడీలు దేశానికి అవినీతిని బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. బుధవారం తన ఎన్నికల హామీని మరోసారి స్పష్టంచేస్తూ దేశంలోప్రతి నిరుపేద వ్యక్తికి కనీస ఆదాయం వచ్చేవిదంగా కృషిచేస్తామని, ఉపాధి హామీని మహాత్మాగాంధీ పథకం కింద కల్పిస్తామని వెల్లడించారు. ఎంజిఎన్‌రేగా ద్వారా ప్రజలు ఎంతో లబ్దిపొందారని, అయితే ఈనిర్ణయం ద్వారా మరింతగా ఎంజిఎన్‌రేగాతో లబ్దిపొందుతారని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదలందరికీ ఐదారునెలలపాటు కనీసాదాయ పథకానికి రూపకల్పనచేస్తోందని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తానురోజుకు రైతు కుటుంబానికి రూ.17 మాత్రమే ఇస్తానని చెపుతున్నారని, అదే కాంగ్రెస్‌ పార్టీ ప్రతి కుటుంబానికి ప్రనతి నిరుపేద వ్యక్తికి భారత్‌లో కనీసాదాయం లభించేంటట్లు కృషిచేస్తుందని అన్నారు.ఈ ఆదాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ అవుతాయని ఆయన అన్నారు. ఈ కనీస ఆదాయ హామీ అనేది తమ యుపిఎ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఎంజినరేగా పథకాన్ని పోలి ఉంటుందని అన్నారు. నరేంద్రమోడీ 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.3.50లక్షలకోట్లు రుణాలు రద్దుచేస్తే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రతి ఒక్కరికి నేరుగా ఖాతాలో జమ అయ్యేటట్లు కనీసాదాయాన్ని తెస్తుందని పేర్కొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిరక్షిస్తుందని అన్నారు. మీకు ధైర్యం ఉంటే మేం చేపట్టే పథకాన్ని ఆపాలని ఆయన సవాల్‌చేసారు. అదేజరిగితే దేశం మొత్తం మీపై పోరాడుతుందని కాంగ్రెస అధ్యక్షుడు స్పష్టంచేసారు. జోకులు, అవాకులు చవాకులకు కాలం చెల్లిందని, ఇపుడు కనీస ఆదాయ వనరుల అనేది ప్రారంభం అయిందని అన్నారు. ఇపుడు దేశంలో మోడీ, ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌లు ఇరువురూ కూడా దేశానికి అవినీతిని బహుమతిగా ఇచ్చారన్నారు. చిట్‌ఫండ్‌ కుంభకోణం అయితే పట్నాయక్‌, రాఫెల్‌ డీల్‌ అయితేప్రధాని మోడీ అని రాహుల్‌ ధ్వజమెత్తారు. నిరుపేదలనుంచే సొమ్మును దోపీడిచేసారని, పెద్దనోట్ల రద్దుద్వారా వచ్చిన సొమ్మును విజ§్‌ుమాల్యా, నీరవ్‌మోడీలకు కట్టబెట్టారని ఆరోపించారు. అనిల్‌ అంబానికి రూ.30వేల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోనికి వస్తే దోపిడీచేసిన సొమ్మును మొత్తం కక్కిస్తుందని, మొత్తంసొమ్ము పేదలకు అందేటట్లు చూస్తుందని పేర్కొన్నారు. పంటరుణాలమాఫీని అమలుచేస్తామని, క్వింటాలు ధాన్యానికి రూ.2600 కనీసమద్దతుధర లభించేటట్లుచూస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా నిరుపేదలకు భూమిని పంపిణీచేస్తామని, గిరిజనులు ఎలాంటి సంప్రదింపులు లేకుండా భూమిని సేకరించుకోవచ్చని అన్నారు. వారినుంచి సేకరించిన భూమిని మళ్లీ తిరిగి వారికే అప్పగిస్తామన్నారు. ఐదేళ్లలోపు ఆభూమిలో ఫ్యాక్టరీలో ఏర్పాటుచేయనిపక్షంలో భూములు వెనక్కితీసుకుంటామన్నారు. ఛత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం సేకరించిన భూమిని వెనక్కి ఇచ్చిందని, టాటాగ్రూప్‌ప్రాజెక్టుకోసం గిరిజనుల భూమిని సేకరించిందని, అయితే ఐదేళ్లలో ఎలాంటిప్రాజెక్టురాలేదని పేర్కొన్నారు. ఒడిశాలోని గిరిజన ప్రాంతంలో ధనా మాఝి అనే గిరిజనుడు తన భార్య దేహాన్ని 12 కిలోమీటర్లపాటు మోసుకునినడిచిన సంఘటన సిగ్గుచేటని, పట్నాయక్‌కు ఏమైనా అభిమానం ఉంటే ఈ సంఘటనపై క్షమాపణలు చెప్పాలని కోరారు. మౌనం ఎంతమాత్రం బిజెడి సమాధానం కాదని గుర్తుచేసారు. అలాగే డోంగ్రియా కంద్‌ గిరిజనులు బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగాజరుపుతున్న పోరాటానికి మద్దతుపలికారు. 2008లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు కలహండిలోని లంజాఘర్‌లో ర్యాలీనిర్వహించారు. వేదాంతగ్రూప్‌ అల్యూమినియం రిఫైనరీ ఉన్న ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ప్రాంతంలో బాక్సైట్‌తవ్వకాలను నియామగిరి కొండలప్రాంతంలో తవ్వకాలను వ్యతిరేకిస్తోంది. కలహంది గిరిజనులకోసం ఢిల్లీలో సైనికుడులాంటి రాహుల్‌గాంధీ ఉఆన్నరని మరిచిపోవద్దని పేర్కొన్నారు. భవానిపుత్రతోపాటు రాహుల్‌గాంధీ రూర్కెలాలో జరిగిన సమావేశంలకూడా పాల్గొన్నారు. ఒడిశా పిసిసి ప్రచారకమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్‌ ఈసారి ఎన్నికల్లో కలహండి నియోజకవర్గంనుంచే పోటీచేయాలనినిర్ణయించారు. అందుకోసమే ప్రచారాన్ని రాహుల్‌ ఇక్కడినుంచే ప్రారంభించారు.