ఉద్యోగ సంఘాల నేతలతో సియం భేటీ

kcr
kcr

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో సియం కేసిఆర్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌ రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ఇటీవలే ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ సారథ్యంలోని మంత్రుల కమిటీకు సియం కేసిఆర్‌కు నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై సియం కేసిఆర్‌ చర్చిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై సియం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక అన్ని అంశాలపై సియం దిశానిర్ధేశం చేయనున్నారు.