ఉద్యోగ వయోపరిమితి 42 యేళ్లకు పెంపు

unemployment
unemployment

ఉద్యోగ వయోపరిమితి  42 యేళ్లకు పెంపు

అమరావతి : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 42 యేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగా లకు 34 ఏళ్ల వయోపరిమితి ఉండగా, దాన్ని మరో 8 ఏళ్లకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఇతర ఉద్యోగాలకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతున్నట్లు సోమవారం జిఎం ఎంఎస్‌ నెంబర్‌ 182ని విడుదల చేసింది. పోలీస్‌, ఎక్సైజ్‌, అగ్నిమాపక, అటవీ, ట్రెజరీ, పెన్షన్లు తదితర ప్రభుత్వ శాఖల్లో వివిధ కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టులను డైరక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయడంలో పెంచిన వయోపరిమితిని పరిగణలోకి తీసుకోనున్నారు