ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు ఎస్ బ్యాంక్ క‌స‌ర‌త్తు?

Yes Bank
Yes Bank

ముంబై: త‌మ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు ఎస్ బ్యాంకు తీవ్ర కసరత్తు ప్రారంభించింది. 30 రోజుల ముందు నోటీసులు ఇచ్చి ఉద్యోగులను తీసి వేసేందుకు ఎస్ బ్యాంకు ప్రణాళిక సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం. కాగా ఈ నోటీసులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, ఉద్యోగులందరికీ మెయిల్స్ ద్వారా ఎస్ బ్యాంకు నోటీసులు పంపించారని తెలుస్తోంది. గతంలో ఎస్ బ్యాంక్ 2500 మంది ఉద్యోగులను తొలగించింది.