ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌ 600కార్లు ఇవ్వనున్న: సావ్‌జీ ఢోలాకియా 

billioaire
billioaire

న్యూఢిల్లీ: సూరత్‌కు చెందిన బిలియనీర్ డైమండ్ వ్యాపారి సావ్‌జీ ఢోలాకియా ప్రతి ఏడాదిలాగే ఈసంవత్సరం కూడా తమ ఉద్యోగులకు దీపావళికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు. హరే కృష్ణ ఎక్స్‌పోర్టర్స్ యజమాని అయిన ఢోలాకియా.. ఈ ఏడాది 600 మంది ఉద్యోగులకు దివాలీ గిఫ్ట్‌లు సిద్ధం చేశారు.   అంతేకాక మరికొందరు ఉద్యోగులకు నగలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు   తెలిపాయి.   సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఢోలాకియా ఏకంగా మెర్సెడీజ్ బెంజ్ జీఎల్‌ఎస్ 350డీ ఎస్‌యూవీలను గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు