ఉద్యోగంలో నైపుణ్యత అవసరం

      ఉద్యోగంలో నైపుణ్యత అవసరం

necessity of skills
necessity of skills

నమస్తే మేడమ్‌, నా పేరు శ్రావణి. నేను ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నా బాస్‌ నన్ను ఎప్పుడూ భయపెడుతూ ఉంటుంది. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తానని అంటూ ఉంటుంది. నాకేమో చాలాబాధగా ఉంటుంది. నాకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. నేను ఏం చేసి, ధైర్యంగా ఉండి, నిలదొక్కుకోగలను?
– శ్రావణి, హైదరాబాద్‌
మీరు తప్పక ఈ సమస్యల నుండి వెంటనే బయటపడగలరు. ఇందులో సందేహం లేదు. మీరు భయపడకూడదు. ధైర్యంగా ఉండండి. ఆత్మస్థయిర్యంతో ఉండండి. నిర్భలత్వం మంచిదికాదు. మీరు మీ వ్యక్తిత్వాన్ని దృఢంగా ఉంచుకోండి. భయపడితే, అంతా భయపెడుతూనే ఉంటారు. మీనైపుణ్యాలే మీకు రక్ష. మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది. మీ ఉద్యోగంలో మీరు సంతృప్తిగా పనిచేయండి. ఎవరేమన్నా, మీరు మీ పనిలో రాణించండి. అదే మీకు అండగా ఉంటుంది. మీ విజ్ఞానం, మీ నైపుణ్యాలు, మీ వ్యక్తిత్వం, మీ మూర్తిమత్వం (పర్సనాల్టీ) మీకు రక్ష. భయపడకుండా, మీ పని మీరు చేసుకుపోవాలి. సరైన సమాధానాలు ఇవ్వాలి. కుంచించుకుపోతే, అందరూ హేళన చేస్తారు. అందువల్ల అన్నీ సానుకూలంగా ఆలోచించాలి. అన్నీ మీ దృక్పధం మీద ఆధారపడి ఉంటాయి. వ్యతిరేక భావనల వల్ల అన్నీ వ్యతిరేకంగా కనబడతాయి. అన్నీ మీలోనే ఉన్నాయి. అన్ని సామర్థ్యాలు అన్నీ మీలోనే ఉన్నాయి. మీరు మంచి స్పష్టతతో, అవగాహనతో ఉండాలి. ఉద్యోగాన్ని ఆనందంగా చేయాలి. జీవితంలో అన్నీ ఆనందంగా పరిష్కరించుకోవాలి.

లివర్‌ సమస్య తీరడం లేదు
నమస్తే మేడమ్‌, నా పేరు సుజన, నాకు 28 సంవత్సరాలు. నాకు లివర్‌లో ఇన్ఫెక్షన్‌ వచ్చింది. చాలా నొప్పితో ఉన్నాను. డాక్టర్లకు చూపించాను. కానీ తగ్గటం లేదు. చాలా విరక్తి కలుగుతోంది. నేను ఏం చేస్తే నా జబ్బు పూర్తిగా నయం అవ్ఞతుంది?
– సుజన, వరంగల్‌
మీ జబ్బు పూర్తిగా నయం అవ్ఞతుంది. అందువల్ల మీరు ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఎన్నో మానసిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ మానసిక చికిత్సల ద్వారా శారీరక సంబంధమైన వ్యాధులన్నీ నయమయిపోతాయి. ఇందులో సందేహం లేదు. కేవలం మందుల వల్లే జబ్బులు నయం కావ్ఞ. వీటికితోడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడి, కుంగుబాటు ఉండకూడదు.

ముందుగా వ్యాధికి గల కారణాలు తెలుసుకొని, వాటిని నుంచి బయటపడాలి. తరువాత వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. శరీరంలోని మలినాలను పారద్రోలాలి. వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. వర్తమానంలో ఆనందంగా జీవించాలి. ఇవన్నీ జరగాలంటే, అయిదారు రకాలైన మానసిక, శారీరక చికిత్సలు నిపుణుల దగ్గర తీసుకోవాలి.

వీటి గురించి ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. వాటి ఫలితాలు శాస్త్రీయత పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటి గురించి తెలుసుకొని మంచి వృత్తి నిపుణుల దగ్గర వైద్యం చేయించుకోండి. తప్పక వెంటనే తగ్గిపోతుంది. కోపం, ఉద్రేకం, ఒత్తిడి లాంటి రుగ్మతలను దరిచేరనీయవద్దు. ఆనందంగా ఉండండి. ఆశావహ దృక్పధం చాలా మంచిది. ప్రతిరోజూ సంతోషంగా ఉండాలి. జీవితం అమూల్యమైనది.
– డాII ఎం. శారద సైకాలజీ ప్రొఫెసర్‌