ఉద్ధానం స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం స్పందించాలి

PAWAN
PAWAN

ప‌లాసః శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర నాలుగో రోజూ కొనసాగుతోంది. దీనిలో భాగంగా పవన్‌.. పలాసలో ఉద్దానం కిడ్నీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు మండలాల్లో ఇంత మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఉండడం బాధాకరమన్నారు. వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్‌ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. ముందుగా బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రి లేరని.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఈ సమస్యపై 48 గంటల్లో ముఖ్యమంత్రి స్పందించకపోతే.. తన పర్యటన ఆపి నిరాహార దీక్ష చేస్తానని పవన్‌ ప్రకటించారు.