ఉద్దానం బాధితులకు ప్రభుత్వం కృషి: మంత్రి చినరాజప్ప

N. Chinarajappa
N. Chinarajappa

కాకినాడ: కిడ్ని బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై హోెంశాఖమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. పవన్‌ అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆర్వో ప్లాంట్లు మూడు డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కిడ్నీ రోగులకు నెలకు రూ.2,500 పెన్షన్‌ అందజేస్తున్నామని చినరాజప్ప తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు.