ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్
AP Panchayat Elections 2021
అమరావతి: ఏపిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్ నమోదైంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్న్నారు.
•శ్రీకాకుళం26.81 శాతం
•విజయనగరం48.08 శాతం
•విశాఖ జిల్లా40.94 శాతం
•తూర్పుగోదావరి 34.51 శాతం
•పశ్చిమగోదావరి 31.6 శాతం
•కృష్ణా జిల్లా 35.81 శాతం
•గుంటూరు జిల్లా 45 శాతం
•ప్రకాశం జిల్లా 34.14 శాతం
•నెల్లూరు జిల్లా 36.3 శాతం
•చిత్తూరు జిల్లా 33.50 శాతం
•కర్నూలు జిల్లా 46.96 శాతం
•అనంతపురం జిల్లా 41.29 శాతం
•వైఎస్సార్ జిల్లా 35.17 శాతం
రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.