ఉదయం 10:30 వరకు జిల్లాల వారీగా పోలింగ్
ap-panchayat-election
అమరావతి: ఏపిలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల వరకు పోలింగ్.. తూర్పుగోదావరి 29 శాతం పశ్చిమగోదావరి 24 శాతం..కృష్ణా జిల్లా 36 శాతం..గుంటూరు జిల్లా 30 శాతం..వైఎస్ఆర్ జిల్లా 29.21 శాతం..అనంతపురం 27 శాతం..ప్రకాశం జిల్లా 28.65 శాతం..నెల్లూరు జిల్లా 26.72 శాతం..చిత్తూరు జిల్లా 36.38 శాతం..కర్నూలు జిల్లా 49 శాతం కాగా, పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.