ఉత్థాన పద్మాసనం

YOGA1

ఉత్థాన పద్మాసనం

లావుగా ఉన్నవారు ఈ ఆసనం వేయడం వలన శరీరం బాగా తగ్గుతుంది. ఎక్కువ సమయం ఈ ఆసనం వేయడం మంచిది. విధానం: నేలపై వెల్లకిలా పడుకుని, కాళ్లను బారజాపి దగ్గరగా చేర్చు కోవాలి. ఆ తరువాత చేతులు తొడల ప్రక్కగా నేల మీద అర చేతులను ఆనించి, ఊపిరి తీసుకుంటూ రెండు కాళ్లనూ ఒకేసారి బాగా పైకి లేపాలి. ఇలా కొంతసేపు ఉన్న తరు వాత మళ్లీ యధాస్థానానికి వచ్చే యాలి. ఉపయోగాలు: ఈ ఆసనం వేయడం వలన పొట్ట తగ్గుతుంది. ఛాతి విశాలంగా తయారవ్ఞతుంది. నడుంనొప్పి, తొడలనొప్పి వంటివి కూడా తగు ్గ తాయి. వయసుపై బడుతున్నా యవ్వనవంతుల్లా కనబడతారు.