ఉత్త‌మ్‌కు దానం నాగేంద‌ర్ స‌వాల్‌

Danam Nagender
Danam Nagender

హైద‌రాబాద్ః తాను భూకబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఉత్తమ్ ఏనాడైనా కాంగ్రెస్ జెండా మోశాడా అని ప్రశ్నించారు. అప్పటి రాష్ట్రపతి రికమెండేషన్ తో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నాడన్నారు. మేము కాంగ్రెస్ లో పోరాటాలు చేశాం.. జైలుకెళ్లామన్నారు. ఉత్తమ్ ఎప్పుడైనా జైలుకెళ్లాడా.. లాఠీ దెబ్బలు తిన్నాడా అని అడిగారు. ఎన్నికల తర్వాత ఉత్తమ్ ను గాంధీ భవన్ మెట్లు ఎక్కనివ్వరని అన్నారు. కాంగ్రెస్ ఖేల్ ఖతం అవ్వడం మొదలైందన్నారు.